కర్నూలు జిల్లా డోన్ నియోజకవర్గ పరిధిలోని డోన్ పట్టణంలో గురువారం కొండపేట జెండా కట్ట సమీపంలో అన్నదమ్ముల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఈ గొడవలో అన్న అయిన శ్రీనివాసులుపై పీడిబాకు (కత్తి) తో తమ్ముడు రామకృష్ణ పొడిచి తీవ్రంగా గాయపరిచాడు.కాగా ఈ ఘర్షణలో తీవ్రంగా గాయపడిన అతన్ని గమనించిన స్థానికులు డోన్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పరిస్తితి విషమించడంతో మెరుగైన వైద్యం కోసం కర్నూలుకు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa