మద్దికెర మండలంలో రోజురోజుకూ మరణాలు సంభవిస్తుండటంతో గ్రామస్థులు ఆందోళన చెందుతున్నారు. ఆర్టీసీలో పనిచేస్తూ పదవీ విరమణ చేసిన మద్దికెరకు చెందిన ఓ వ్యక్తి (60) ఇటీవల కరోనా బారినపడ్డారు. కర్నూలు కొవిడ్ ఆసుపత్రిలో చికిత్స పొంది పూర్తిగా కోలుకుని ఈనెల 20న ఇంటికి చేరారు. సోమవారం మళ్లీ తీవ్ర అస్వస్థతకు గురికాగా కర్నూలులోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందారు. మృతుడికి భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa