ఓలా ఎలక్ట్రిక్‌ను గ్లోబల్ ఇంజనీరింగ్ సంస్థగా మార్చే లక్ష్యంతో సంస్థాగత పునర్నిర్మాణాన్ని ప్రారంభిస్తామని ఓలా క్యాబ్స్ సహ వ్యవస్థాపకుడు , సీఈఓ భవీష్ అగర్వాల్ పేర్కొన్నారు. ఓలా క్యాబ్స్ కు చెందిన సంస్థ విద్యుత్తు ద్విచక్ర వాహన తయారీలో ముందడుగు వేస్తోందని, తొలి ఉత్పత్తిని త్వరలో విడుదల చేయడానికి తమ బృందం కృషి చేస్తోందని తెలిపారు. ఈ నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా భారీ నియామకాలను చేపట్టనున్నట్టు వెల్లడించారు.భారీ ఎత్తున ఎలక్ట్రిక్ వాహనాల తయారీ లక్ష్యంగా పెట్టుకున్నామని, ఈ లక్ష్య సాధనలో భాగంగానే రాబోయే 3 నెలల్లో ప్రపంచవ్యాప్తంగా 1,000 మంది ఇంజనీర్లను నియమించుకుంటామని, ఇతర విభాగాలలో మరో 1,000 మందిని ఎంపిక చేయనున్నామని మంగళవారం ఉద్యోగులకు ఇచ్చిన అంతర్గత ఈ- మెయిల్ సమాచారంలో అగర్వాల్ తెలిపారు. గ్లోబల్ మార్కెట్ , అన్ని విభాగాలలో ఎలక్ట్రిక్ వాహనాలు, బాస్ వ్యవస్థలను నిర్మించడం లక్ష్యమనీ, ఇందుకోసంత్వరలో అనేక కొత్త కార్యక్రమాలను ప్రారంభించబోతున్నామన్నారు.
![]() |
![]() |
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa