కర్నూలు జిల్లా నంద్యాల డివిజన్ పరిధిలోని నంద్యాల పట్టణంలో బుధవారం నిర్వహించనున్న గణేష్ నిమజ్జనం ఏర్పాట్లను స్థానిక ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిశోర్‌రెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో నిబంధనలు పాటిస్తూ ప్రభుత్వం సూచించిన విధంగా నిమజ్జనం కార్యక్రమాన్ని మధ్యాహ్నం లోపు ముగించుకోవాలని పిలుపునిచ్చారు. కరోనా కారణంగా ఈ సంవత్సరం వినాయక నిమజ్జనం హంగు ఆర్భాటాలు లేకుండా భక్తులు గుమ్మిగూడకుండ ఉండాలని భక్తులు సహకరించి నిమజ్జనాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
![]() |
![]() |
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa