కర్నూలు జిల్లా నంద్యాల డివిజన్ పరిధిలోని నంద్యాల పట్టణంలో హమాలీల సమస్యలు పరిష్కరించాలంటూ ధర్నాలు, నిరసనలు చేస్తున్నా ప్రభుత్వం స్పందించకపోవడంతో సెప్టెంబర్ 1 నుంచి నిరవధిక సమ్మెలోకి వెళ్తున్నట్లు సీఐటీయూ నాయకుడు లక్ష్మణ్ తెలిపారు. ఈ మేరకు టెక్కె మార్కెట్ యార్డులోని గోదాము ఎదుట మంగళవారం హమాలీలతో కలిసి సీఐటీయూ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. కూలీ రేట్ల పెంపుతోపాటు ఈఎస్ఏ, కరోనా బీమా సౌకర్యం కల్పించాలన్నారు.ఈ కార్యక్రమంలో నాయకులు గౌస్, నాగేశ్వరరావు, శివ, నాయక్, తదితరులు పాల్గొన్నారు.
![]() |
![]() |
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa