కర్నూలు పట్టణంలోని కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ వీరపాండ్యన్ ఆధ్వర్యంలో ఆదివారం టంగుటూరి ప్రకాశం పంతులు జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అతిధులు మాట్లాడుతూ... స్వాతంత్రోద్యమ సంగ్రామంలో టంగుటూరు ప్రకాశం పంతులు సేవలను కొనియాడారు. బ్రిటిష్ వారికి ఎదురొడ్డి ఛాతిని చూపిన ధైర్యశాలి అని అన్నారు. ఈ కార్యక్రమంలో నందికొట్కూరు ఎమ్మెల్యే తొగురు ఆర్థర్, కోడుమూరు నియోజకవర్గం ఎమ్మెల్యే డాక్టర్ జరదొడ్డి సుధాకర్, పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి, జెసి3 (సంక్షేమం)సయ్యధ్ ఖజ మోహద్ధిన్, డీఆర్వో పుల్లయ్య, తదితర అధికారులు పాల్గొన్నారు.
![]() |
![]() |
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa