కర్నూలు జిల్లాలోని గడివేముల మండల పరిధిలో చుట్టుపక్కల గ్రామాలలో కరోనా విజృంభణ రోజురోజుకూ పెరుగుతూ వస్తోంది. మండలంలోని పెసరవాయిలో 13, బిలకల గూడూరు 1, తిరుపాడు 1, దుర్వేసిలో 1 పాజిటివ్ కేసు నమోదైనట్లు మండల వైద్యాధికారి డాక్టర్ సుజన తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ... కరోనా కట్టడిలో భాగంగా ప్రజలందరూ సామాజిక దూరం పాటిస్తూ, మాస్కులు ధరించి కార్యకలాపాలను కొనసాగించాలని తెలిపారు. ప్రజలు కరోనా రోజురోజుకు పెరుగుతున్న నేపథ్యంలో అత్యవసరం అయితే తప్ప బయటికి రావద్దని ఆమె తెలిపారు.
![]() |
![]() |
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa