తుగ్గలి మండలంలోని రేషన్ కార్డు లబ్ధిదారులు తప్పనిసరిగా ఈ కేవైసీ చేయించుకోవాలనే తహసీల్దార్ వెంకటలక్ష్మి తెలిపారు. శుక్రవారం ఆమె తహసీల్దార్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ... మండలంలో మొత్తం 16654 రేషన్ కార్డులు ఉన్నాయని, ఇంకా 1942 రేషన్ కార్డుల లబ్ధిదారులు ఈ కేవైసీ చేయించుకోవాలని ఆమె తెలిపారు. అందువల్ల ఈ కేవైసీ చేయించుకొని లబ్ధిదారులు తక్షణమే గ్రామ వాలంటీర్ల వద్దకు వెళ్లి ఈ కేవైసీ చేయించుకోవాలని ఆమె తెలిపారు. అలాగే వాలంటీర్లు కూడా ఈ పనిపై పూర్తిగా నిమగ్నమై ఉండాలని ఆమె తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa