మహిళలకు అత్యంత ప్రమాదకరమైన దేశం ఏదో తెలుసా..? ఎవరైనా గెస్ చేయగలరా..? అక్షరాల మన దేశమే..! 2018లో థామ్సన్ రాయిటర్స్ ఫౌండేషన్ నిర్వహించిన సర్వేలో ఈ దిగ్భ్రాంతికర విషయం వెల్లడైంది. భారత్ తర్వాత ప్లేస్‌లో ఆఫ్ఘనిస్తాన్, సిరియా వంటి దేశాలు ఉన్నాయి. లైంగిక హింస, కల్చర్, మహిళల అక్రమ రవాణా, లైంగికేతర హింస, వివక్ష, ఆరోగ్య పరిరక్షణ వంటి అంశాలను ప్రాతిపదికగా తీసుకుని ఈ సర్వే నిర్వహించడం జరిగింది.ఈ సర్వే ప్రకారం మొదటి స్థానంలో ఇండియా, రెండో స్థానంలో ఆఫ్ఘానిస్తాన్, మూడో స్థానంలో సిరియా ఉన్నాయి. తర్వాత స్థానాల్లో సోమాలియా, సౌదీ అరేబియా, పాకిస్తాన్, కాంగో, యెమెన్, నైజీరియా, అమెరికా ఉన్నాయి.అయితే 2011లో ఇదే సంస్థ నిర్వహించిన సర్వేలో భారత్ నాలుగో స్థానంలో ఉండగా 2018లో ప్రథమ స్థానంలోకి వచ్చింది. సెక్సువల్ హెరాస్‌మెంట్, సంస్కృతీ సంప్రదాయాలు, మహిళల అక్రమ రవాణా అంశాల్లో భారత దేశం ప్రథమ స్థానంలో నిలిచింది. ప్రభుత్వ లెక్కల ప్రకారమే భారతదేశంలో 2007-2016 మధ్య మహిళలపై నేరాల సంఖ్య 83 శాతం పెరిగాయని సర్వే సంస్థ విశ్లేషించింది. మహిళా అంశాల మీద ప్రపంచ వ్యాప్తంగా కృషి చేస్తున్న 548 మంది నిపుణులను సంప్రదించి ఈ సర్వే నిర్వహించినట్టు రాయిటర్స్ ఫౌండేషన్ తెలిపింది.వాస్తవానికి 2012లో ఢిల్లీ సామూహిక అఘాయిత్యం ఘటన తర్వాత దేశంలో ఇలాంటి సంఘటనలు జరగడం తగ్గుతాయని చాలామంది భావించి ఉంటారని, కానీ వాస్తవానికి అలా జరగలేదని థామ్సన్ రాయిటర్స్ ఫౌండేషన్ సీఈవో మోనిక్ విల్లా అభిప్రాయపడ్డారు. కొత్త చట్టం వచ్చినప్పటికీ చాలా మంది మహిళలపై లైంగిక నేరాలు పెరిగాయని అన్నారు.మహిళలపై అన్ని రూపాల్లో జరుగుతున్న హింసను 2030 నాటికి లేకుండా చేస్తామని 2014లో ప్రపంచ దేశాల అధినేతలు వాగ్దానం చేశారని, రాజకీయ, ఆర్థిక, ప్రజా జీవితంలో సమానత్వం కల్పిస్తామని పేర్కొన్నారని ఈ సర్వే గుర్తు చేసింది. కానీ నేడు ప్రపంచంలో దీనికి భిన్నమైన వాతావరణం నెలకొందని, ప్రపంచంలోని మహిళల్లో ప్రతి ముగ్గురిలో ఒకరు.. తమ జీవిత కాలంలో లైంగిక హింసకు గురవుతూనే ఉన్నారని సర్వే పేర్కొంది. ఈ సర్వే ప్రకారం బాలికల వివాహ సమస్య ఇంకా తీవ్రంగానే ఉంది. ఏడున్నర కోట్ల మంది మహిళలకు 18వ ఏట కంటే ముందే వివాహం అయిపోతుంది. దీనివల్ల టీనేజీలో గర్భధారణలు అధికం అయ్యాయి. దీంతో వారి ఆరోగ్యం ప్రమాదంలో పడుతుందని సర్వే పేర్కొంది.మన దేశంలో ఆడవాళ్లు పరిస్థితి ఎలా ఉందో చూశారుగా. రోజురోజుకు దారుణాలు పెరిగిపోతున్నాయి. ఇలాంటి విషయాలు చాలామందికి తెలియదు. దీనిపై అవగాహన పెరిగితేనే మన చుట్టూ ఉన్న మహిళలను మనం కాపాడుకోగలగుతాం. వీలైనంత ఎక్కువ మందికి తెలిసేలా ఈ వివరాలను షేర్ చేయండి.
![]() |
![]() |
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa