మాజీ మంత్రి మోపిదేవి వెంకటరమణ రాజ్యసభకు వెళ్లడంతో ఖాళీ అయిన ఎమ్మెల్సీ స్థానానికి వైసీపీ నేత పెన్మత్స సూర్యనారాయణ రాజు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ మేరకు ఎన్నికల అధికారి ఓ ప్రకటన చేశారు. ఇటీవల వైసీపీ సీనియర్ నేత పెన్మత్స సాంబశివరాజు మరణించగా, ఆయన కుమారుడు సూర్యనారాయణ రాజుకు పార్టీ హైకమాండ్ చేయూతనిచ్చింది. ఆయనను ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ అభ్యర్థిగా ప్రకటించింది. ఈ ఎన్నిక కోసం పెన్మత్స సూర్యనారాయణ రాజు ఒక్కరే నామినేషన్ వేయడంతో ఏకగ్రీవం అయినట్టు ఎన్నికల అధికారి పేర్కొన్నారు. దాంతో శాసనమండలిలో వైసీపీ బలం 11కి పెరిగింది.
![]() |
![]() |
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa