భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు. రాజ్యాంగంలోని 5వ భాగం 4వ అధ్యాయంలో 124 నుండి 147 వరకు సుప్రీం కోర్ట్ నిబంధనలు ఉంటాయి. వారసులందరికీ హక్కులు ఉంటాయి. స్త్రీలయినా, పురుషులయినా హక్కుల సమానమే. భారతరాజ్యాంగం 14వ అధికరణం ద్వారా ఎంతోకాలం పురుషాధిక్యత చూపిన మన సమాజంలో స్త్రీలకు సమాన ఆస్థిహక్కులు లభించాయి.ఏడూ దశాబ్దాల చరిత్రలో సర్వోన్నత న్యాయస్థానము ఓక చారిత్రాత్మకమైన తీర్పును వెలువరించింది. ఇది ఆగష్టు 11 ,2020 న ఇవ్వడం జరిగింది. కొడుకైనా… కూతురైనా ఒక్కటే… ఇద్దరికీ ఆస్తిలో వాటా దక్కాల్సిందే… తండ్రి జీవించి ఉన్నా లేకపోయినా… కూతురు జీవించి ఉన్నా లేకపోయినా ఆస్థిలో కూతురుకు వాటా ఇవ్వాల్సందే… సుప్రీం కోర్టు కుమార్తెలకు వారసత్వ వాటా పొందే హక్కు ఉంటుంది అని స్పష్టం చేసింది. తండ్రి, తల్లి మరణించిన ఈ హక్కు ఉంటుంది అని తెలిపింది సుప్రీంకోర్టు. అంతేకాదు ఆమె జీవించిలేకపోయినా సంతానానికి దక్కుతుంది అని,ఈ తీర్పులో ఎలాంటి సందేహాలు అక్కరలేదు అని సర్వోత్తమైన న్యాయస్థానం తేల్చి చెప్పింది. జస్టిస్ అరుణ్ కుమార్ మిశ్రా నేతృత్వంలోని ముగ్గురు న్యాయమూర్తుల బెంచ్ ఈ సవరణ చట్టం గురించి వ్యాఖ్యానిస్తూ “కొడుకు లానే కూతురు కూడా ఎప్పటికీ కూతురే. ఆమె తండ్రి బ్రతికున్నా లేకపోయినా ఆ కూతురు ఎప్పటికీ ఆ వారసత్వ ఆస్తిపై సమాన హక్కులు కలిగి ఉంటుందని” తెలిపింది. ఆడపిల్లకు వారసత్వ ఆస్తిలో సమానమైన వాటా ఇవ్వాలని, కుమారునితో సరిసమానంగా కుమార్తెకు కూడా ఆస్తిలో హక్కు ఉంటుంది అని ఈ తీర్పు ద్వారా సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఉదారహణకు, ఏదైనా ఒక కుటుంబంలో ఒక వ్యక్తికి ముగ్గురు పిల్లలు ఉంటే, పిత్రార్జిత ఆస్తిలో ఆ వ్యక్తి ముగ్గురు పిల్లలకు, భార్యకు సమాన భాగాలు లభిస్తాయి.
మరి హిందూ వారసత్వ చట్టం ఏంటి...?
ఇది 1956 నుంచి అమలులోకి వచ్చింది. 2005 సెప్టెంబర్ 9 న ఈ హిందూ వారసత్వ చట్టానికి భారత పార్లమెంట్ సవరణకు ఆమోదం తెలిపింది. 1956 నాటి హిందూ వారసత్వ చట్టంలో సవరణలు చేపట్టే నాటికి కుటుంబంలో ఆడపిల్ల పుట్టినా, పుట్టకపోయినా.. ఈ సవరణ వర్తిస్తుందని స్పష్టం చేసిందికానీ 2005లో చట్ట సవరణ ద్వారా తండ్రి ఆస్తిపై కొడుకు, కూతురికి సమాన హక్కు కల్పించారు. అయితే ఆస్తిలో హక్కు ఎవరికి ఉంటుంది, ఎవరికి ఉండదు అనేది తెలుసుకునే ముందు పిత్రార్జితం అని దేన్ని అంటారో కూడా తెలుసుకోవడం అవసరం.హిందూ కుటుంబంలో ఆస్తి పంపకం రెండు అంశాల ప్రాతిపదికన జరుగుతుంది. ఒకటేమో స్వార్జితం. రెండోదేమో పిత్రార్జితం. 2005 నాటి హిందు వారసత్వ చట్టం1956 సవరణ ప్రకారం.. తండ్రి వారసత్వ ఆస్తిలో కూతురికి కొడుకుతోపాటు సమాన హక్కు ఉంటుంది. కూతురికి పెళ్లైనా కూడా ఆమె హక్కు ఎక్కడికీ పోదు.వీలునామా లేకుంటే?
"పిత్రార్జితం కాకుండా స్వార్జిత ఆస్తి ఉన్నప్పుడు, అందులో ఆ వ్యక్తి భార్యకు, పిల్లలకు హక్కు ఉంటుంది. వారితోపాటు ఆ వ్యక్తి తల్లిదండ్రులు కూడా జీవించి ఉంటే, వారు తమ కొడుకుపై ఆధారపడి ఉంటే, వారికి కూడా ఆ ఆస్తిలో భాగం లభిస్తుంది" అని డాక్టర్ సౌమ్య తెలిపారు. ఆ వ్యక్తి తల్లిదండ్రులు ఆస్తిలో భాగం కోరుకోకుంటే, వారసులు ఎవరైనా వారి భాగాన్ని తీసుకుని, వారి బాధ్యతను చూసుకోవచ్చు" అని ఆమె వెల్లడించారు.
![]() |
![]() |
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa