ట్రెండింగ్
Epaper    English    தமிழ்

బంపరాఫర్..యమహా బైక్ రూ.5వేలతో బుకింగ్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Aug 17, 2020, 06:30 PM

చాలా మంది బైకులపై మంచి ఆఫర్లు ఏమున్నాయో తెలుసుకోవాలనుకుంటున్నారు. బైక్ కొనాలనుకునేవారికి ఇప్పుడొక బంపరాఫర్ ముందుకొచ్చింది. జపాన్ కంపెనీ యమహాకు ఎక్కువ క్రేజ్ ఉన్న సంగతి తెలిసిందే. అందుకే భారతీయుల కోసం ఓ మంచి ఆఫర్‌తో ముందుకొచ్చింది. ఇప్పుడు కస్టమర్లు... R15 V3, MT15, FZ25, FZS-Fi, FZ-Fi బైకులను ఆన్‌లైన్‌లో బుక్ చేసుకోవచ్చు. ఇలాంటి అవకాశం కల్పించడానికి కారణం కరోనా వైరస్సే. ఇప్పడు బైక్ కొనుక్కోవాలనుకునేవారు ఇంట్లో ఉండి ఆన్‌లైన్ సర్వీస్ ద్వారా ఏ బైక్ కావాలంటే అది బుక్ చేసుకోవచ్చు. ఈ కంపెనీ ప్రత్యేక వర్చువల్ స్టోర్‌ని ప్రారంభించింది. అందులో అన్ని రకాల బైకులనూ ఎగా దిగా చూడొచ్చు. ఆ తర్వాత నచ్చింది కొనేయొచ్చు.బైక్ బుక్ చేసుకోవడానికి జస్ట్ రూ.5000 మాత్రమే అడుగుతోంది యమహా. ఇంత తక్కువ ధరకు బైక్ బుకింగ్ అనేది ఎక్కడా లేదంటోంది. ఇది కస్టమర్లకు లాభం చేకూర్చే ఉద్దేశంతో ఈ ఆఫర్ తెచ్చినట్లు చెబుతోంది. సాధారణ ప్రజలకు తమ బైకులు, సర్వీసులూ చేరాలన్నదే తమ కోరిక అన్నారు యమహా మోటర్ గ్రూప్ ఛైర్మన్. త్వరలో ఈ కంపెనీ రిటైల్ సెక్టార్‌లో కూడా ఆన్‌లైన్ సర్వీస్ ప్రారంభించాలనుకుంటోంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa