ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కత్తెరకు కరోనా కళ్లెం!

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Aug 17, 2020, 06:28 PM

కరోనా వైరస్ పుణ్యమా అని కత్తెర ఆడటం లేదు. కడుపు నిండటం లేదు. సన్నాయి మూగబోయింది. సంసారం బారమైంది. మాయ దారి కరోనా కత్తెరకు తాళం వేసింది. వాయిద్యానికి మంగళం ఈ వృత్తినే ఆధారంగా జీవనం సాగించే నాయీ బ్రాహ్మణుల జీవనం కరోనా కారణంగా దుర్భరంగా మారింది. ఏరోజు కారోజు సంపాదనతో కడుపు నింపుకునే క్షురకులు, ఏడాదికి వచ్చే రెండు మూడు శుభ ముహూర్తాలకే ఏడాంత ఆసరాగా జీవనం సాగించే వాయిద్యకారుల జీవితాల్లో కరోనా కటిక చీకటిపై 'లోకల్ యాప్' ప్రత్యేక కథనం...


కరోనా దెబ్బతో లాక్ డౌన్ సమయంలో అష్టకష్టాలను ఎదుర్కోన్నారు. ఇప్పుడు మహుర్తాలు ఉన్నా.. ఉపాది లేక అల్లాడిపోతున్నారు. దీంతో నాయీ బ్రాహ్మణులు నానా కష్టాలను ఎదుర్కొంటున్నారు. రోజంతా కత్తెర ఆడితేనేగానీ నాలుగైదు వందలు సంపాదించడం భారంగా మారినా.. దాంతోనే జీవనం సాగిస్తూ వస్తున్న వీరు ఇప్పుడు జీవనాన్ని ఎలా సాగించాలో తెలియక నానా తిప్పలు పడుతున్నారు. విశాఖలో పలు ప్రాంతాల్లో క్షౌర వృత్తితో జీవనం సాగిస్తున్న వందలాది కుటుంబాలు రోజు రోజుకు భారమవుతున్న జీవనంతో కృంగిపోతున్నారు. ప్రభుత్వంలా డౌన్ నిబంధనల్లో మొదట్లోనే సెలూన్ షాపులు మూసివేయాలని చెప్పిందేగానీ.. వారిని ఆదుకోవడం మాత్రం ఇప్పటి వరకు ఆలోచించలేదన్న ఆవేదన వారిలో వ్యక్తమవుతోంది.ఆ కత్తెర ఆడితేనే కడుపునింపుకునే నాయీబ్రాహ్మణులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. లాక్ డౌన్లో వీరి పరిస్థితి మరింత భారంగా మారింది. అనాదిగా క్షౌర వృత్తితో జీవనం సాగిస్తున్న వీరు ఇలాంటి కష్టాలను చవి చూస్తామని ఎప్పుడు ఊహించలేదు.సెలూన్ షాపులు నిర్వహిస్తూ బ్రతుకుతుండే వారు కొందరైతే, ఇప్పటికి గ్రామీణ ప్రాంతాల్లో ఇళ్ళకు వెళ్ళి క్షౌర వృత్తిలో జీవనం సాగించేవారు ఉన్నారు. కరోనా వైరస్ కట్టడి కోసం కొనసాగుతున్న లాక్ డౌన్ తో పట్టణాలతో పాటు.. పల్లెల్లో కూడా వీరి వృత్తిపై కట్టడి తప్పలేదు. దీంతో లాక్ డౌన్ మొదలైనప్పటి నుంచి వృత్తికి దూరమై, సంపాదనకు కష్టమై ఇబ్బందులు పడుతున్నారు.ఈ వృత్తిని నమ్ముకున్నవారు జీవనానికి దూరమయ్యారు. వీటిలో ఒక్నో షాపులో పని చేస్తున్న వాళ్లు కూడా ఆర్దికంగా చితికిపోతూ.. ఇబ్బందులు పడుతున్నారు. అప్పట్లోనే అంతంత మాత్రంగా నాయీ బ్రాహ్మణులు నిర్వహిస్తున్న సెలూన్ షాపులతో నిర్వాహకులుగానీ, వారి దగ్గర పనిచేసే వర్కర్లుగానీ ఏరోజుకారోజు అన్నట్లుగా జీవనం సాగించేవారు. షాపు నిర్వాహకులైతే గదుల అద్దెలు, కరెంటు బిల్లు కూడా చెల్లించాలి. లాక్ డౌన్ సమయంలో షాపులు మూసి వేసి సంసారం గడవడమే భారమైతే.. ఇందుకు తోడు అద్దెలు, విద్యుత్ చార్జీలు, షాపుల్లో పనిచేసేందుకు వచ్చి ఇక్కడే నిలచిపోయిన వారిని ఇంత కాలంగా పోషించడం మరింత భారంగా మారింది. ఇలాంటి పరిస్థితుల్లో అప్పులు సప్పులు చేసుకోవాల్సిన పరిస్థితి ఎదురైంది. లాక్ డౌన్ లో దాదాపు అన్ని వర్గాల పరిస్తితి ఇబ్బందిగా మారడంతో అప్పులు పుట్టడం కూడా క్లిష్ట పరిస్థితుల్లో నానా కష్టాలు పడుతున్నారు. సెలూన్ షాపులు మూసివేయడంతో ఎవరైన పిలిస్తే ఇళ్ళ వద్దకే వెళ్ళి క్రాప్, సేవింగ్ చేసేందుకు క్షౌర వృత్తిలో ఉన్నవారు సిద్ధపడుతున్నా అది కూడా భారమైంది.లాక్ డౌన్ విధించిన సందర్భంగా గ్రీన్, ఆరెంజ్ జోన్లలో సెలూన్ షాపులు తెరచుకోవచ్చని ప్రభుత్వం సడలింపు ఇచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం కూడా రెడ్ జోన్, కంటైన్మెంట్ జోన్లలో మినహా మిగిలిన చోట్ల తెరచుకోవచ్చని తెలిపింది.ఈ క్రమంలో నాయీ బ్రాహ్మణులు ప్రస్తుతం ఇబ్బందులు ఎదుర్కొంటున్న సమయంలో సీఎం జగన్ మోహన్ రెడ్డి ఆదుకోవాలని పలువురు కోరుతున్నారు. నాయీ బ్రాహ్మణుల్లో కొందరు క్షౌరవృత్తితో కొందరు, మరికొందరు వాయిద్య వృత్తితో జీవనం సాగిస్తున్నారు. వాయిద్య కళాకారులకు ఏడాదంతా వాయించే అవకాశం ఉండదు. రెండు మూడు సందర్భాల్లో వారికి అవకాశం దొరుకుంది. దీంతోనే ఏడాదంతా వారు జీవనంసాగించాలి. ఇలాంటి వారికి ఈ రెండు నెలలు ఎంతో ముఖ్యమైనవి. ఫిబ్రవరి, మార్చి ఏప్రిల్, మే నెలలో పెళ్ళిల్లు, జాతరలు, శుభకార్యాలు ఉంటాయి. ఈ రెండు నెలలు లాక్ డౌన్ పూర్తిగా కొనసాగడంతో పెళ్ళిళ్ళు, జాతరలు లాంటివి వాయిదా వేసుకున్నారు. లాక్ డౌన్ ఆంక్షలతో శుభకార్యాలు గానీ, జాతరలు గానీ, రద్దు చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. చిరరకు చావు మేళానికి కరోనా కట్టడి వేసింది.ఈ పరిస్థితుల్లో వాయిద్యం నమ్ముకున్న వారు తీరని నష్టపోయి కష్టాలను ఎదుర్కొంటున్నారు. క్షురకులు, వాయిద్య కళాకారులు ఎదుర్కొంటున్న సమస్యలపై ప్రభుత్వం స్పందించి వారికి, అవసరమైన సహకారాన్ని నిబంధనలతోనైనా సరే షాపులు తెరచుకునే అవకాశాన్ని అయినా కల్పిస్తే గానీ వారు గట్టెక్కే అవకాశం లేదు.ఈ కాలంలో షాపులు పూర్తిగా మూసి వేయడంతో ఆర్థిక ఇబ్బందులు ఎదురయ్యాయి. నెలంతా కష్టపడితే షాపు నిర్వాహకుడిగా అద్దె, కరెంటు బిల్లు, నిర్వహణ ఖర్చులు కూడా భారంగా మారాయి.రెండు నెలలుగా పనులులేక చేతికి పైసా కూడా రాని పరిస్థితి ఏర్పడటంతో తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. ప్రభుత్వం స్పందించి షాపులు తెరచుకునేందుకు అవకాశం కల్పించడంతో పాటు ఇంతకాలంగా నష్టపోయినందుకు ఆర్థికంగానూ నిత్యావసర వస్తువుల పరంగానూ క్షౌరవృత్తి దారులను ఆదుకోవాలని కోరుతున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa