కర్నూలు జిల్లా డోన్ నియోజకవర్గ పరిధిలోని డోన్ మండలం ధర్మవరం గ్రామంలో ఆదివారం ఓ గొర్రె వింత ఆకారం కల్గిన గొర్రెకు జన్మనిచ్చింది. వెంకటనయిని పల్లె గ్రామానికి చెందిన గొర్రెల యజమాని రాజు గొర్రెలు కాసేందుకు ధర్మవరం గ్రామ పరిసర ప్రాంతంలో మేత కోసం తీసుకెళ్లారు. అక్కడే ఓ గొర్రె వింత ఆకారంతో గొర్రెపిల్లకు జన్మనిచ్చింది. గుడ్లగూబ వలె తల వింతగా ఉండటంతో గ్రామ ప్రజలు చూసేందుకు వెళ్లారు. వింతగా పుట్టిన గొర్రె గంట తర్వాత చనిపోయిందని యజమాని తెలిపారు.
![]() |
![]() |
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa