ఒకవైపు కరోనాకు కళ్లెం వేసేందుకు వాక్సిన్ కనిపెట్టడానికి ప్రయత్నాలు సాగుతున్న విషయం తెలిసిందే. మరో వైపు ఈ మహమ్మారి బలహీనతలేమిటో గుర్తించేందుకూ శాస్త్రవేత్తలు ముమ్మరంగా పరిశోధనలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే అమెరికాలోని నార్త్‌వెస్టర్న్ యూనివర్శిటీ శాస్త్రవేత్తల పరిశోధనల్లో ఈ వైరస్ కొమ్ములో ఓ లోటును గుర్తించారు. ఈ లోటు ఆధారంగా కరోనాకు మెరుగైన చికిత్స కల్పించవచ్చని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.ఈ మహమ్మారి మనిషి శరీర కణాల్లోకి ప్రవేశించేందుకు కరోనా వైరస్ స్పైక్ ప్రొటీన్ లేదా కొమ్మును వాడుతుంది. అయితే ఈ ప్రొటీన్ కణానికి అంటుకునే ప్రాంతానికి కొన్ని నానోమీటర్ల దూరంలో ఓ చీలిక లాంటిది ఉందని శాస్త్రవేత్తలు గుర్తించారు. ధనావేశం కలిగి ఉండే ఈ చీలికకు రుణావేశపు పరమాణువును జోడిస్తే వైరస్ కణానికి అతుక్కోవడం నిలిచిపోతుందని తాము గుర్తించినట్లు ఈ పరిశోధనల్లో పాలు పంచుకున్న శాస్త్రవేత్త మోనికా ఒలివేరా డిలా క్రజ్ తెలిపారు. వైరస్ జన్యుక్రమంలో వచ్చిన మార్పుల కారణంగా వైరస్ వ్యాప్తి వేగం తగ్గిందని కూడా తమ పరిశోధనలు తెలుపుతున్నాయన్నారు.
![]() |
![]() |
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa