ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఖాళీగా ఉన్న 52 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసిన NIE

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Aug 10, 2020, 07:36 PM

భార‌త ప్ర‌భుత్వ ఆరోగ్య‌, కుటుంబ సంక్షేమ మంత్రిత్వశాఖకు చెందిన చెన్నైలోని ఐసీఎంఆర్‌-నేష‌న‌ల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఎపిడిమియాల‌జీ (ఎన్ఐఈ).. వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న 52 ఉద్యోగాల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది. ఈ పోస్టులు ప‌్రాజెక్ట్ సీనియ‌ర్ క‌న్స‌ల్టెంట్‌, ప్రాజెక్ట్ సైంటిస్ట్‌, ప్రాజెక్ట్ టెక్నిక‌ల్ ఆఫీస‌ర్‌, ప్రాజెక్ట్ టెక్నీషియ‌న్ త‌దిత‌ర విభాగాల్లో ఉన్నాయి. దేశంలోని ఏ ప్రాంతం వారైనా ఈ జాబ్స్ కు అప్లై చేయవచ్చు.


అర్హ‌త‌: పోస్టును అనుస‌రించి ప‌దోత‌ర‌గ‌తి, ఇంట‌ర్మీడియ‌ట్‌, సంబంధిత స‌బ్జెక్టుల్లో డిప్లొమా, గ్రాడ్యుయేష‌న్‌, పీజీ డిగ్రీ, ఎంబీబీఎస్‌, ఎండీ/ ఎంఎస్ ఉత్తీర్ణ‌తతో పాట నిర్దిష్ట అనుభ‌వం ఉండాలి.‌


వయసు: పోస్టులను బట్టి మారుతూ ఉంటుంది. 30-40 ఏళ్ల మధ్య ఉండాలి.


వేతనం: రూ.18 వేల నుంచి రూ.64 వేల వరకు ఉంటుంది.


ఇంట‌ర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.


ఈ-మెయిల్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.


ద‌ర‌ఖాస్తుకు చివ‌రి తేది: ఆగస్టు 24, 2020


దరఖాస్తులు పంపాల్సిన ఈ-మెయిల్‌ ఐడీ: nieprojectcell@nieicmr.org.in


పూర్తి వివరాలకు nie.gov.in/ వెబ్‌సైట్‌ చూడొచ్చు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa