బెంగుళూరు : ఎన్ని చట్టాలు వచ్చినా యువతులు, మహిళలపై దాడులు ఆగడం లేదు. మలయాళనటి భావనపై వేధింపుల ఘటన మరువకముందే బెంగుళూరులో మరో దారుణం జరిగింది. విధులు ముగించుకుని ఇంటికి వెళుతున్న ఎయిర్ హోస్టేస్పై దుండగుడు దాడి చేశాడు. బైక్పై వచ్చి ఆ యువతి దుస్తులు చించేశాడు. ఈ దాడితో ఆమె ఒక్కసారిగా షాక్కు గురైంది. అంతలోనే చుట్టుపక్కల మహిళలు అరవడంతో యువకుడు అక్కడి నుంచి బైక్పై పారిపోయాడు. యువతి పిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు.