విశాఖ : విశాఖలో భూ ఆక్రమణలను పరిశీలిచేందుకు సీపీఐ బృందం వెళ్లింది. సీపీఐ నేత నారాయణ భూ ఆక్రమణలను పరిశీలిస్తూ.. అక్కడ ఏర్పాటు చేసిన ప్రహరీ గోడను పదే పదే తన్నారు. ఈ క్రమంలో గోడ విరగడంతో నారాయణ కాలు అందులో ఇరుక్కుపోయింది. వెంటనే అప్రమత్తమైన సీపీఐ కార్యకర్తలు నారాయణ కాలును బయటకు లాగారు. నారాయణ కాలికి స్వల్ప గాయమైంది.