ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రన్‌వేపై పల్టీ కొట్టిన విమానం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, Jun 25, 2017, 10:24 AM

అమెరికాలోని ఒహైయో రాష్ట్రంలోని డేటన్‌ విమానాశ్రయంలో ఓ యుద్ధ విమానం రన్‌వేపై దిగుతుండగా అదుపుతప్పి పల్టీ కొట్టింది. విమానంలో చిక్కుకున్న ఇద్దరిని రక్షించారు. ఎయిర్‌ షోలో చేపట్టే విన్యాసాల కోసం సన్నద్ధమయ్యేందుకు ఎఫ్‌-16డీ యుద్ధ విమానం డేటన్‌ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి టేకాఫ్‌ అయింది. అయితే అదే సమయంలో ఎయిర్‌పోర్ట్‌ ప్రాంతంలో భారీ వర్షం కురిసింది. అనంతరం విమానం రన్‌వేపై దిగుతుండగా అదుపుతప్పి పక్కకు ఒరిగి పల్టీ కొట్టింది. ఈ ప్రమాదంలో పైలట్‌తో పాటు సాంకేతిక నిపుణుడు విమానంలో చిక్కుకున్నారు. వీరిని బయటకు తీసేందుకు సిబ్బంది గంటకుపైగా శ్రమించారు. అనంతరం వీరిని ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై అధికారులు విచారణకు ఆదేశించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com