ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అభిమానులపై బాలయ్య గరంగరం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, Jun 25, 2017, 01:30 AM

హిందూపురం, సూర్య ప్రధాన ప్రతినిధి : ఎట్టకేలకు మూడు నెలల తర్వాత తన నియోజకవర్గానికి వచ్చిన హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ తొలిరోజే కార్యకర్తలు, అభిమానులపై చిర్రుబుర్రులాడారు. దీంతో చాలామంది ఆయన ఎదుటపడకుండా పక్కకు తప్పుకున్నారు. తొలుత మండల కేంద్రమైన చిల మత్తూరు నుంచి బైక్‌పై వస్తున్న బాలకృష్ణ లేపాక్షిలో ఓ పోలీసు అధికారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం హిందూపురం ప్రభుత్వాస్పత్రి భవనం ప్రారంభ సమయంలో ఫొటోలకు అడ్డొస్తున్నాడని 11వ వార్డు మున్సిపల్‌ కౌన్సిలర్‌ రామ్మూర్తిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ పక్కనే ఉన్న ఆస్పత్రి సూప రింటెండెంట్‌ కేశవులును కూడా పక్కకు వెళ్లమని ఆదేశించారు. మరోవైపు పూజ జరిగేటప్పుడు కూడా ఓ అర్చకుడిపైన బాలకృష్ణ అసహనం వ్యక్తం చేశా రు. ఎమ్మెల్యేగా గెలిచిన మొదట్లోనూ బాలకృష్ణ ఇలాగే చిర్రుబుర్రులాడేవారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com