విశాఖ హిందూస్థాన్ షిప్ యార్డులో జరిగిన ప్రమాదంలో చనిపోయిన మృతుల కుటుంబాలకు రూ.50 లక్షల ఎక్స్ గ్రేషియాను మంత్రి అవంతి శ్రీనివాస్ ప్రకటించారు. ప్రమాద స్థలిని పరిశీలించిన అనంతరం ఆయన ఈ ప్రకటన చేశారు. అలాగే మృతుల కుటుంబాల్లో ఒకరికి ఉద్యోగమిస్తామన్నారు. షిప్ యార్డు ప్రమాదం దురదృష్టకరమని మంత్రి అవంతి శ్రీనివాస్ అన్నారు. విశాఖ షిప్ యార్డులో జరిగిన ప్రమాదంలో 11 మంది మరణించిన విషయం తెలిసిందే.
![]() |
![]() |
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa