కర్నూలు జిల్లా ఆత్మకూరు పట్టణంలో కరోనా భయంతో ఓ వ్యక్తి ఆత్మహత్య విషాదాన్ని నింపింది. పట్టణంలోని రహమత్ నగర్ కు చెందిన షఫీ గత కొంతకాలంగా కార్పెంటర్ వృత్తి చేస్తూ జీవనం సాగిస్తున్నారు.ఆత్మకూరు పట్టణంలో కరోనా పాజిటివ్ కేసులు విజృంభిస్తుండడం, తనకు కరోనా సోకిందేమో అనే అనుమానం తో ఈ నెల 22న టెస్ట్ చేయించుకున్నడు.రిపోర్ట్ లో ఎక్కడ పాజిటివ్ వస్తుందోనన్న భయంతో అటు నుంచి ఆటే వెళ్ళిపోయి నాలుగు రోజుల తరువాత పట్టణ శివార్లలోని డిగ్రీ కళాశాల సమీపం లోని ఓ పాడుబడ్డ బావిలో శవమై తేలాడు. అదే రోజు తనకు నెగిటివ్ రిపోర్ట్ వచ్చిందని కుటుంబ సభ్యులు తెలిపారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
![]() |
![]() |
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa