నిరుద్యోగులకు శుభవార్త. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి నిర్వహించే పరీక్షలకు స్టాఫ్ సెలక్షన్ కమిషన్-SSC కొత్త షెడ్యూల్ ప్రకటించింది. కరోనా వైరస్ సంక్షోభం కారణంగా 8 నోటిఫికేషన్లకు నిర్వహించాల్సిన పరీక్షలు వాయిదా పడ్డాయి. వీటికి ఆగస్ట్ నుంచి అక్టోబర్ వరకు ఎగ్జామ్స్ నిర్వహిస్తామని గతంలో స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ప్రకటించింది. కానీ కరోనా వైరస్ మహమ్మారి ప్రభావం ఇంకా కొనసాగుతుండటం, దేశవ్యాప్తంగా కేసులు పెరుగుతుండటంతో ఈ పరీక్షలకు కొత్త షెడ్యూల్ ప్రకటించింది. 2020 అక్టోబర్ నుంచి డిసెంబర్ వరకు ఈ పరీక్షల్ని నిర్వహించనుంది. స్టాఫ్ సెలక్షన్ కమిషన్ అధికారిక వెబ్‌సైట్ ssc.nic.in/ లో కొత్త షెడ్యూల్ విడుదలైంది.
కంబైన్డ్ హయ్యర్ సెకండరీ (10+2) లెవెల్ ఎగ్జామినేషన్ 2019 (టైర్ 1)- అక్టోబర్ 12, 13, 14, 15, 16, 19, 20, 21, 26
జూనియర్ ఇంజనీర్ (సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్, క్వాంటిటీ సర్వేయింగ్ అండ్ కాంట్రాక్ట్స్) ఎగ్జామినేషన్,2019 (పేపర్ 2)- అక్టోబర్ 27, 28, 29, 30
కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవెల్ ఎగ్జామినేషన్ 2019 (టైర్ 2)- నవంబర్ 2, 3, 4, 5సెలెక్షన్ పోస్ట్ ఎగ్జామినేషన్ 2020 ఫేజ్ VIII- నవంబర్ 6, 9, 10
స్టెనోగ్రాఫర్ గ్రేడ్ సీ అండ్ డీ ఎగ్జామినేషన్ 2019- నవంబర్ 16, 17, 18
జూనియర్ హిందీ ట్రాన్స్‌లేటర్, జూనియర్ ట్రాన్స్‌లేటర్, సీనియర్ హిందీ ట్రాన్స్‌లేటర్, హిందీ ప్రాధ్యాపక్ ఎగ్జామినేషన్ (పేపర్ 1)- 2020- నవంబర్ 11
సబ్ ఇన్‌స్పెక్టర్ ఇన్ ఢిల్లీ పోలీస్ అండ్ సీఏపీఎఫ్ ఎగ్జామినేషన్ (పేపర్ 1)- 2020- నవంబర్ 23, 24, 25, 26
కానిస్టేబుల్ (ఎగ్జిక్యూటీవ్) ఇన్ ఢిల్లీ పోలీస్ ఎగ్జామినేషన్ 2020- నవంబర్ 27, 30, డిసెంబర్ 1, 2, 3, 7, 8, 9, 10, 11, 14
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa