రాశి- మేషం
ప్రైవేటు సంస్థలు, విద్యా సంస్థలలోని వారికి యాజమాన్యం నుంచి ఒత్తిడి అధికమవుతుంది. ఉద్యోగ, వివాహ యత్నాలు అనుకూలిస్తాయి. ఇంటాబయటా మరింత అనుకూల స్థితి. కొత్త కార్యక్రమాలు చేపట్టి పూర్తి చేస్తారు. బంధువుల సలహాలతో కొత్త నిర్ణయాలు తీసుకుంటారు. వేడుకల్లో పాల్గొంటారు. ఆర్థికంగా కొంత పురోగతి సాధిస్తారు.
రాశి- వృషభం
ఎల్.ఐ.సి, బ్యాంకు ఫిక్స్‌డ్ డిపాజిట్ల ధనం అందుకుంటారు. పనుల్లో ఆటంకాలు, చికాకు కలిగిస్తాయి. బంధువర్గం నుంచి విమర్శలు ఎదుర్కొంటారు. వివాదాలకు కొంత దూరంగా ఉండండి. ఆకస్మిక ప్రయాణాలు ఉంటాయి. ఆర్థికంగా ఇబ్బందులు ఎదురవుతాయి. తీర్థ యాత్రలు సాగిస్తారు. రియల్‌ఎస్టేట్‌ల వారికి ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తాయి.
రాశి- మిధునం
సేవా కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటారు. సన్నిహితులతో వివాదాలు పరిష్కారం. అందరిలోనూ గౌరవమర్యాదలున పొందుతారు. ప్రత్యర్థులు అనుకూలంగా మారతారు. సభలు, సమావేశాల్లో పాల్గొంటారు. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. కాంట్రాక్టర్లు, రియల్టర్ల యత్నాలు ముందుకు సాగవు. వ్యాపారాలలో లాభాలు అందుతాయి.
రాశి- కర్కాటకం
చేపట్టిన పనులు పూర్తి చేయగలుగుతారు. పనుల్లో జాప్యంతో ఇబ్బంది పడతారు.. కొత్త రుణ యత్నాలు ముమ్మరం చేస్తారు. ఆరోగ్య సమస్యలు వేధిస్తాయి. బంధువుల నుంచి విమర్శలు ఎదుర్కొంటారు. కష్టించినా ఫలితం అందుకోలేరు. వాహనాల విషయంలో నిర్లక్ష్యం వద్దు. రియల్ ఎస్టేట్‌ల వారికి సమస్యలు ఎదురుకావచ్చు. విద్యార్థులకు ఒత్తిడులు తప్పవు.
రాశి- సింహం
ఉద్యోగ విషయంలో పదోన్నతికి సంబంధించిన ప్రయత్నం ఒక కొలిక్కి వస్తుంది. కొత్త పనులు చేపట్టి విజయవంతంగా పూర్తి చేస్తారు. బంధువులు, ఆత్మీయుల ఆదరణ లభిస్తుంది. పెండింగ్ వ్యవహారాలు పూర్తి చేస్తారు. సంఘంలో గౌరవం పెరుగుతుంది. ఉద్యోగ ప్రయత్నాలు కలసివస్తాయి. దేవాలయ దర్శనాలు చేసుకుంటారు. కాంట్రాక్టర్లకు ఊహించని టెండర్లు దక్కుతాయి.
రాశి- కన్య
బంధువుల రాకతో గృహంలో సందడి కానవస్తుంది. నూతన కార్యక్రమాల్లో విజయం సాధిస్తారు. నిరుద్యోగులకు ఉద్యోగ యోగం. కొత్త ఆశలతో ముందుకు సాగుతారు. కొన్ని వివాదాల నుంచి బయపడతారు. చిన్ననాటి సంఘటనలు గుర్తుకు వస్తాయి. ఆర్థికంగా సామాన్యంగా ఉంటుంది. కోర్టు వ్యవహారాల్లో ఫ్లీడర్లు, ఫ్లీడరు గుమస్తాలకు చికాకులు తప్పవు.
రాశి- తుల
దూర ప్రయాణాలలో వస్తువుల పట్ల మెలకువ వహించండి. రాబడి అంతగా ఉండదు.బంధువులతో తగాదాలు. అనుకున్న పనుల్లో అవాంతరాలు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. చిన్ననాటి మిత్రులను కలుసుకుని కష్టసుఖాలు విచారిస్తారు. ఐటీ నిపుణులకు వివాదాలు నెలకొంటాయి. ఆదాయ వ్యయాలకు పొంతన ఉండదు.
రాశి- వృశ్చికం
ఈరోజు ఆర్థిక వ్యవహారాలలో, గృహ,భూ సంబంధ లావాదేవీలలో కొంత జాగ్రత్త అవసరం. రాబడి అంతగా కనిపించదు. దూర ప్రయాణాలు. ఇంటాబయటా వ్యతిరేకత ఎదురవుతుంది. ఇతరుల విషయాల్లో జోక్యం వద్దు. ఆస్తి వివాదాలు నెలకొంటాయి.ధార్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. తొందరపడి పెట్టే పెట్టుబడుల కారణంగా డబ్బు నష్టపోయే అవకాశముంటుంది.
రాశి- ధనస్సు
శత్రువుల విషయంలో కొంత జాగ్రత్త అవసరం. నూతన పరిచయాలు.శుభకార్యాల్లో పాల్గొంటారు. మిత్రుల నుంచి సహాయసహకారాలు అందుతాయి. సంఘంలో గౌరవమర్యాదలు. నిరుద్యోగుల కలలు ఫలిస్తాయి. వ్యవహారాలు సాఫీగానే సాగుతాయి. ఆదాయం సంతృప్తికరంగా ఉంటుంది. రియల్‌ఎస్టేట్‌లు, కాంట్రాక్టర్లకు ఒడిదుడుకులు తొలగుతాయి. వ్యాపారాలు మరింత లాభాల దిశగా సాగుతాయి.
రాశి- మకరం
ఆత్మీయులకు సాయం అందిస్తారు. ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. పనుల్లో పురోగతి కనిపిస్తుంది. మిత్రులతో ఆనందంగా గడుపుతారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. కొన్ని వివాదాలు తీరి ఊపిరిపీల్చుకుంటారు. నిరుద్యోగుల చిరకాల స్వప్నం నెరవేరుతుంది. వాహనాలు, స్థలాలు కొంటారు. కాంట్రాక్టర్లకు అవకాశాలు పెరుగుతాయి.
రాశి- కుంభం
పనుల్లో ఒత్తిడి, శ్రమ అధికం. కుటుంబంలో చికాకులు.పనులు కొన్ని వాయిదా వేస్తారు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. ఆదాయం అంతగా కనిపించదు. దూర ప్రయాణాలు ఉంటాయి. శారీరక రుగ్మతలు. నిర్ణయాల్లో ఆచితూచి వ్యవహరించాలి. రియల్‌ఎస్టేట్‌ల వారికి సామాన్యస్థితి. వ్యాపారులు నిదానంగా వ్యవహరించాలి.
రాశి- మీనం
ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతాయి. పనులు కొన్ని వాయిదా వేస్తారు. ఉద్యోగ ప్రయత్నాలు ముందుకు సాగవు. ఆరోగ్యపరమైన చికాకులు ఉంటాయి. దేవాలయాలు సందర్శిస్తారు. కుటుంబ సమస్యలు తప్పవు. పారిశ్రామికవర్గాలకు విదేశీ పర్యటనలు వాయిదా. ఐటీ నిపుణులకు అంచనాలలో పొరపాట్లు. సకాలంలో చెల్లింపులు జరుపుతారు.
![]() |
![]() |
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa