బెంగళూరు-తిరుపతి మధ్య ఏపీఎస్ ఆర్టీసీ బస్సులను బుధవారం నుంచి తిరిగి ప్రారంభించారు. బెంగళూరులో సంపూర్ణ లాక్‌డౌన్ ఎత్తివేసిన నేపథ్యంలో బస్సులను పునరుద్ధరించారు. ప్రస్తుతం బెంగళూరు- తిరుపతి మధ్య 30 బస్సులు నడిపేందుకు అనుమతులున్నా రద్దీ లేకపోవడంతో ప్రస్తుతం తిరుపతి నుంచి 6 బస్సులను నడుపుతున్నారు. ఇందుకు మంగళవారం నుంచే రిజర్వేషన్లను ప్రారంభించారు. అయితే బెంగళూరు వెళ్లే ప్రయాణికులు అక్కడి ప్రభుత్వ నిబంధనల ప్రకారం సేవ సింధు యాప్‌ను తప్పనిసరిగా వినియోగిస్తూ పేర్లను నమోదు చేసుకోవాతని ఏపీ ఆర్టీసీ అధికారులు వెల్లడించారు.
![]() |
![]() |
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa