మావోయిస్టులు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని చెర్ల మండలంలో రహదారి నిర్మాణ పనుల్లో ఉన్న వాహనాలకు నిప్పు పెట్టారు. ఈ ఘటన బతినప్లలి-తిప్పాపురం గ్రామాల మధ్యలో బుధవారం తెల్లవారుజామున జరిగింది. ఒక బుల్డోజర్, రోడ్ రోలర్‌పై పెట్రోల్ పోసి నిప్పటించినట్లు పోలీసులు తెలిపారు. ఈ చర్యలో సుమారు 10 మంది సభ్యుల బృందం పాల్గొన్నట్లు సమాచారం. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు చర్ల పోలీస్ ఇన్‌స్పెక్టర్ సత్యనారాయణ తెలిపారు.
![]() |
![]() |
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa