దిగ్గజ ఐటీ సంస్థ హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ ఇంజనీరింగ్ విద్యార్థులకు శుభవార్త అందించింది. ఈ ఆర్థిక సంవత్సరంలో 15 వేల మంది ఫ్రెషర్ల నియామకాలను చేపట్టనున్నట్టు ప్రకటించింది. కరోనావైరస్ టెక్నాలజీ సంస్థలను తీవ్రంగా దెబ్బతీసినప్పటికీ, బలమైన డిమాండ్, వృద్ధి అంచనాల నేపథ్యంలో ఫ్రెషర్లకు ఉద్యోగావకాశాలు కల్పించడానికి మొగ్గుచూపుతున్నాయి. ఈ క్రమంలో హెచ్‌సీఎల్ కూడా క్యాంపస్ రిక్రూట్‌మెంట్లపై దృష్టి పెట్టింది.గత ఏడాది 9వేలమందిని ఎంపిక చేసుకున్న సంస్థ ఈ ఏడాది అదనంగా మరో 6 వేల మందిని చేర్చుకోనుంది. ఇతర టెక్ కంపెనీల మాదిరిగానే, హెచ్‌సీఎల్ కూడా తన నియామకాలను వర్చువల్‌గా చేపట్టనుంది. అయితే కరోనా వైరస్, లాక్‌డౌన్ కారణంగా క్యాంపస్‌లలో ప్రెషర్ల ఎంపిక ప్రక్రియ నెమ్మదిగా ఉందని ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో సుమారు 1000 మంది ఫ్రెషర్లను నియమించుకున్నట్టు తెలిపింది. వృద్ధి, ఖాళీలను పూరించే పక్రియలో భాగంగా ఈ నియామకాలు ఉండనున్నాయి. అయితే ఈ ఏడాది కంపెనీని వీడే ఉద్యోగుల సంఖ్య గణనీయంగా తగ్గిందని హెచ్‌ఆర్ హెడ్ వీవీ అప్పారావు తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa