రిలయన్స్ జియో తన జియో ఫోన్ రూ.49, రూ.69 ప్లాన్లను రద్దు చేసింది. ఈ రెండు ప్లాన్లూ ఈ సంవత్సరం ప్రారంభంలో లాంచ్ అయ్యాయి. ఈ రెండు ప్లాన్ల వ్యాలిడిటీ 14 రోజులుగా ఉండేది. ఇప్పుడు ఈ ప్లాన్లను జియో.కాం, మైజియో యాప్ ల నుంచి తొలగించారు.దీంతో ప్రస్తుతం జియో ఫోన్ వినియోగదారులకు అందుబాటులో ఉన్న చవకైన ప్లాన్ రూ.75 ప్లానే. ఈ ప్లాన్ వ్యాలిడిటీ 28 రోజులుగా ఉంది. దీంతో రీచార్జ్ చేసుకుంటే మొత్తంగా 3 జీబీ డేటా, జియో నుంచి జియోకు అన్ లిమిటెడ్ కాల్స్, ఇతర నెట్ వర్క్ లకు కాల్స్ చేసుకోవడానికి 500 నిమిషాలు, మొత్తంగా 50 ఎస్ఎంఎస్ లభించనున్నాయి. దీంతోపాటు జియో యాప్స్ కు కాంప్లిమెంటరీ సబ్ స్క్రిప్షన్ కూడా లభించనుంది.
![]() |
![]() |
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa