పోలీస్ జాబ్ కోసం ప్రిపేర్ అవుతున్న వారికి శుభవార్త. స్టాఫ్ సెలక్షన్ కమిషన్-SSC త్వరలో భారీగా పోలీస్ ఉద్యోగాలను భర్తీ చేయనుంది. ఢిల్లీ పోలీస్ డిపార్ట్‌మెంట్‌లో 5846 కానిస్టేబుల్ పోస్టుల్ని భర్తీ చేయాలంటూ డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్‌కు లేఖ ద్వారా కోరారు. ఈ పోస్టుల్ని భర్తీ చేసేందుకు త్వరలో స్టాఫ్ సెలక్షన్ కమిషన్-SSC నోటిఫికేషన్ విడుదల చేసే అవకాశం ఉంది.
ఇప్పటికే 1564 పోస్టుల పోలీస్ ఉద్యోగాల భర్తీకి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ దరఖాస్తుల్ని స్వీకరిస్తోంది. ఈ నోటిఫికేషన్ ద్వారా సబ్ ఇన్‌స్పెక్టర్ ఇన్ ఢిల్లీ పోలీస్, సెంట్రల్ ఆర్మ్‌డ్ పోలీస్ ఫోర్సెస్‌లో సబ్ ఇన్‌స్పెక్టర్ (జీడీ) పోస్టుల్ని భర్తీ చేయనుంది. ఈ నోటిఫికేషన్ కాకుండా మరో 5846 కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి కొత్త నోటిఫికేషన్ వచ్చే అవకాశముంది. అందుకే అభ్యర్థులు స్టాఫ్ సెలక్షన్ కమిషన్ అధికారిక వెబ్‌సైట్ ssc.nic.in ఫాలో అవుతూ ఉండాలి.
మొత్తం ఖాళీలు- 5846
కానిస్టేబుల్ పురుషులు- 3433
కానిస్టేబుల్ ఎక్స్ సర్వీస్‌మెన్ పురుషులు- 226
కానిస్టేబుల్ ఎక్స్ సర్వీస్‌మెన్ కమాండో పురుషులు- 243
కానిస్టేబుల్ మహిళలు- 1944
మరిన్ని వివరాలకు వెబ్ సైట్ : ssc.nic.in
ఇవి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు కాబట్టి ఏ రాష్ట్రంలోని వారైనా అప్లై చేసుకోవచ్చు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa