ట్రెండింగ్
Epaper    English    தமிழ்

విమానానికి తృటిలో తప్పిన ముప్పు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, Jul 19, 2020, 05:12 PM

తిరుపతి రేణిగుంట విమానాశ్రయంలో పెను ప్రమాదం తప్పింది. ఇండిగో విమానం ప్రమాదం నుంచి ముప్పు తప్పించుకుంది. బెంగళూరు నుంచి 71 మంది ప్రయాణికులతో వచ్చిన ఈ విమానం ల్యాండింగ్ కు సన్నద్ధమవుతున్న తరుణంలో రన్ వేపై ఓ ఫైరింజన్ బోల్తాపడింది. దీంతో చివరి నిమిషంలో ఈ విషయాన్ని అధికారులు గుర్తించిన అధికారులు వెంటనే ఇండిగో విమాన పైలెట్ ను అప్రమత్తం చేశారు. ఆ విమానం మళ్లీ గాల్లోకి లేచింది. దాంతో పెద్ద ప్రమాదం తప్పింది. ఫైరింజన్ ను తొలగించేందుకు సమయం పట్టే అవకాశం ఉండడంతో అధికారులు ఆ విమానాన్ని తిరిగి బెంగళూరుకు మళ్లించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa