ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఏపీ ప్రజలకు మరో గుడ్ న్యూస్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Jul 17, 2020, 07:00 PM

ఏపీ ప్రభుత్వం ఇసుక విషయంలో మరిన్ని కీలక నిర్ణయాలు తీసుకుంది. ఇసుక వినియోగదారులకు ఊరటనిచ్చే శుభవార్తను ప్రభుత్వం చెప్పింది. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు ఈ విధంగా ఉన్నాయి.


- పేదలు, ప్రభుత్వ ప్యాకేజీల వంటి పనులకు ఇసుకను రవాణా చేసే ట్రాక్టర్లకు ప్రభుత్వానికి చెల్లించాల్సిన చలానా నుంచి మినహాయింపు.


- ఇప్పటి వరకు ట్రాక్టర్‌ ఇసుకకు చలానాగా రూ.1,300లు, లోడింగ్‌ చార్జీలు రూ.800లు, రవాణా చార్జీ రూ.1,000 నుంచి రూ.1,500లు కలుపుకొని మొత్తం రూ.3,500 నుంచి రూ.4,000 వరకు వసూలు చేసేవారు. ప్రభుత్వ తాజా నిర్ణయంతో వినియోగదారులకు ట్రాక్టర్‌కు రూ.1,300 భారం తగ్గనుంది.


- ఇసుక కోసం వినియోగదారుడు గ్రామ సచివాలయంలో తన చిరునామాతో అనెక్సర్‌–1లో దరఖాస్తు చేసుకోవాలి.


- ప్రతి వ్యక్తి అర్జీని 24 గంటల్లో పరిశీలించి అనెక్సర్‌–2లో పర్మిట్‌(సమయం, తేదీలతో)ను ఇస్తారు. రీచ్‌ నుంచి 20కి.మీ పరిధిలో మాత్రమే అనుమతిస్తారు.


- రవాణా చేసుకునే సమయంలో సచివాలయం ఇచ్చిన పర్మిట్‌ ఖచ్చితంగా ఉండాలి.


- నోటిఫై చేసిన రీచ్‌ల నుంచి మాత్రమే ఇసుక తరలించాలి.


- ఇసుక పక్కదారి పట్టకుండా గ్రామ కార్యదర్శి పర్యవేక్షించాలి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa