రానురానూ సోషల్ మీడియాలో ఫేక్ న్యూస్ లు పెరిగిపోతున్నాయి. ఏపీలో ప్రభుత్వ ఉద్యోగుల పదవీవిరమణ వయోపరిమితిని తగ్గిస్తున్నారంటూ ఇటీవల ప్రచారం జరుగుతోంది. దీనిపై ఉద్యోగ సంఘాల నేతలు సీఎం కార్యాలయాన్ని సంప్రదించారు. ఈ నేపథ్యంలో సీఎంవో అధికారులు ఉద్యోగుల పదవీవిరమణ వయోపరిమితిని మార్చడంలేదంటూ స్పష్టం చేశారు. ఇదంతా దుష్ప్రచారమనీ, వయోపరిమితి అంశంలో ఎలాంటి చర్యలు ఉండబోవని వివరించారు. దీనిపై అసత్య ప్రచారం చేస్తే చర్యలు ఉంటాయని సీఎంఓ హెచ్చరించింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa