రాశి-మేషం
వాహనయోగం ఉంది. జీవిత భాగస్వామి నుంచి ఆస్తి లాభం పొందుతారు. ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతారు. ప్రయాణాలు వాయిదా. పనులలో అవరోధాలు. కుటుంబ సభ్యులతో విభేదాలు. ఆలయాలు సందర్శిస్తారు. రియల్ ఎస్టేట్‌ల వారికి లేనిపోని ఇబ్బందులు. వ్యాపార లావాదేవీలు నత్తనడకన సాగుతాయి. ఉద్యోగులకు బదిలీలు. పారిశ్రామికవేత్తలు మరింత శ్రమించాలి.
రాశి-వృషభం
క్రయవిక్రయాలలో లాభాలు గడిస్తారు. వస్తు లాభం పొందుతారు. కుటుంబ సభ్యులతో వివాదాలు. అనుకోని ప్రయాణాలు ఉంటాయి. ఆరోగ్య సమస్యలు చికాకు పరుస్తాయి. ఆస్తి వివాదాలు నెలకొనవచ్చు. ఆలయాలు సందర్శిస్తారు. భార్యాభర్తల మధ్య అకారణంగా తగాదాలు. రాబడి తగ్గుతుంది. ఉద్యోగులకు విధుల్లో ఆటంకాలు. కళాకారులకు కొత్త సమస్యలు.
రాశి-మిధునం
ఇతరుల ధనసహాయం విషయంలో తొందరపాటు తగదు. ఆలోచనలు అమలు చేస్తారు. చిన్ననాటి మిత్రులను కలుసుకుని ముఖ్య విషయాలు చర్చిస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. పాత బాకీలు సైతం వసూలవుతాయి. భూములు, స్థలాలు కొంటారు. ఉద్యోగులకు ఉత్సాహవంతంగా ఉంటుంది. రాజకీయవేత్తలు, కళాకారులకు సత్కారాలు.
రాశి-కర్కాటకం
ఆరోగ్యం పట్ల అప్రమత్తంగా ఉండాలి. శ్రమానంతరం పనులు పూర్తి చేస్తారు. మానసిక అశాంతికి లోనవుతారు. ఆర్థిక పరిస్థితి నిరాశ కలిగిస్తుంది. కుటుంబ సభ్యులతో తగాదాలు. దూరపు బంధువులను కలుసుకుంటారు. రియల్ ఎస్టేట్‌ల వారు కొంత నిరాశ చెందుతారు.వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. ఉద్యోగులకు ఒత్తిడులు తప్పవు.
రాశి-సింహం
పత్రాల రెన్యువల్‌లో అలక్ష్యం తగదు. అనుకోని విధంగా ధన లబ్ధి. ఉద్యోగ యత్నాలలో పురోగతి. చిరకాల ప్రత్యర్థుల నుంచి ఆహ్వానాలు అందుతాయి. ప్రయాణాల్లో నూతనోత్సాహం. ముఖ్యమైన పనులు సాఫీగా సాగుతాయి. పుణ్య క్షేత్రాలు సందర్శిస్తారు. పనులు ముగింపు దశలో హడావుడిగా సాగుతాయి.
రాశి-కన్య
ఈరోజు ఆర్థిక వ్యవహారాలకు సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకుంటారు. ఆర్థిక పరిస్థితి కాస్త ఊరటనిస్తుంది. దూర ప్రయాణాలు ఉంటాయి. బంధువులతో తగాదాలు. శారీరక రుగ్మతలు తప్పవు. ఆదాయానికి మించి ఖర్చులు ఉంటాయి. కొన్ని కార్యక్రమాలు మధ్యలో విరమిస్తారు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. ఉద్యోగులకు పనిభారం పెరుగుతుంది. పారిశ్రామికవేత్తలు విదేశీ పర్యటనలు వాయిదా వేస్తారు.
రాశి-తుల
పెట్టుబడులపై దృష్టి సారిస్తారు. ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. చిన్ననాటి విషయాలు గుర్తుకు వస్తాయి. కొత్త కాంట్రాక్టులు దక్కించుకుంటారు. ప్రముఖుల నుంచి ఆహ్వానాలు రాగలవు. వాహనాలు, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. ఆదాయం మరింత పెరుగుతుంది. ఉద్యోగులకు హోదాలు దక్కుతాయి. వ్యాపారాలలో నిదానం పాటించండి.
రాశి-వృశ్చికం
అదనపు ఆదాయం కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. భార్యాభర్తల మధ్య సయోధ్య ఏర్పడవచ్చు. బంధువుల నుంచి ఆహ్వానాలు అందుకుంటారు. పుణ్య క్షేత్రాలు సందర్శిస్తారు. ప్రత్యర్థులు సైతం మిత్రులుగా మారతారు. రియల్ ఎస్టేట్‌ల వారికి పట్టింది బంగారమే. విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు.
రాశి-ధనస్సు
బహుమతులు ఇచ్చిపుచ్చుకుంటారు. ఆర్థిక పరిస్థితి మందగిస్తుంది. అనుకోని ప్రయాణాలు ఉండవచ్చు. సోదరులు, జీవిత భాగస్వామితో విభేదాలు.. పనుల్లో ఆటంకాలు ఎదురవుతాయి. పాత మిత్రులను కలుసుకుంటారు. కాంట్రాక్టర్ల శ్రమ ఫలిస్తుంది. వ్యాపారాలలో గందరగోళంగా ఉంటుంది. ఉద్యోగులకు విధుల్లో మార్పులు.
రాశి-మకరం
ఒక సమాచారం ఉపశమనం కలిగిస్తుంది. వ్యవహారాలలో ఆటంకాలు. ఆస్తి వివాదాలు చికాకు పరుస్తాయి. బంధువుల నుంచి మాటపడాల్సి వస్తుంది. భార్యాభర్తల మధ్య కొన్ని వివాదాలు నెలకొంటాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. ఆర్థిక లావాదేవీలు నిరుత్సాహపరుస్తాయి. శారీరక రుగ్మతలు బాధిస్తాయి. రియల్‌ఎస్టేట్‌ల వారు ఆచితూచి వ్యవహరించాలి. వ్యాపారాలలో లాభాలు అంతగా కనిపించవు.
రాశి-కుంభం
పిల్లల విషయంలో శుభ పరిణామాలున్నాయి. బంధువుల నుంచి ముఖ్య సమాచారం. శ్రేయోభిలాషుల నుంచి ఆహ్వానాలు అందుతాయి. పుణ్య క్షేత్రాలు సందర్శిస్తారు. శత్రువులు మిత్రులుగా మారతారు. ఉద్యోగ యత్నాలు అనుకూలిస్తాయి. సభలు, సమావేశాల్లో పాల్గొంటారు. వ్యాపారులకు లాభాలు అందుతాయి. ఉద్యోగులకు పదోన్నతులు దక్కవచ్చు.
రాశి-మీనం
సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. అందరిలోనూ గుర్తింపు రాగలదు. మిత్రులతో వివాదాలు సర్దుబాటు కాగలవు. స్థలాలు, వాహనాలు కొంటారు. చిరకాల కోరిక నెరవేరుతుంది. భార్యాభర్తల మధ్య అపోహలు తొలగుతాయి. చిన్ననాటి పరిచయస్తులను కలుసుకుంటారు. విరామ కాలక్షేపాలు ఉల్లాసం కలిగిస్తాయి. సినీ, రాజకీయ రంగాల వారికి అనుకూలం.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa