హీరోకు విలనిజాన్ని యాడ్ చేయడం.. ఇప్పటి సినిమాల్లో, వెబ్ సిరీస్‌లో ట్రెండ్‌గా నడుస్తోంది..! నిజానికి ప్రపంచంలో హీరో కమ్ విలన్‌లు చాలామందే ఉన్నారు..! వాళ్లనే హీరోలుగా భావించి ప్రజలు ఆరాధించారు..! వాళ్లే కొంతమంది పాలిట విలన్లుగా మారి రక్తపాతాన్ని సృష్టించారు..!ముమ్మార్ గడాఫీ లిబియా ప్రజలకు ఒకప్పుడు హీరో. తర్వాత అదే ప్రజల చేతుల్లో దారుణంగా చంపబడ్డాడు. లిబియా దేశంలో తొలుత రాచరిక వ్యవస్థ ఉండేది.. ఆ వ్యవస్థలో ప్రజలు ఎన్నో బాధలు పడేవారు. అలాంటి వ్యవస్థపై గడాఫీ తిరుగుబాటు చేశాడు. 1969లో గఢాఫీ గద్దెనెక్కాడు. దాంతో గడాఫీని ప్రజలు హీరోగా ఆరాధించేవారు. అయితే అధికారం వచ్చాక గడాఫీ విలన్‌గా టర్న్ అయ్యాడు. విలాసాలు చేసేవాడు. లిబియాలోని చమురు బావులను కుటుంబ సభ్యుల, బంధువుల చేతుల్లో పెట్టి.. ఆ వచ్చే ఆదాయాన్ని ఇష్టమొచ్చినట్టు ఖర్చు చేసేవాడు. తాను చెప్పింది వినకపోతే ప్రజలను హింసించేవాడు. కఠిన శిక్షలు విధించేవాడు. ఎవరైనా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే.. వాళ్లను కాల్చి చంపేవాడు. 2004లో ఈ అరాచకం మరీ ఎక్కువడడంతో ప్రజలు తిరుగుబాటు చేసి.. గడాఫీని చంపేశారు.సద్దాం హుస్సేన్.. ఇరాక్‌ను 25 ఏళ్ల పాటు పాలించిన వ్యక్తి. అరబ్బులకు హీరో. పాశ్చాత్య దేశాలకు విలన్. 1979లో తనకు తానుగానే సద్దాం అధ్యక్షుడుగా ప్రకటించుకున్నాడు. సద్దాం అధికారం చేపట్టగానే కీలక పదవులన్నీ సున్నీలకు కట్టబెట్టాడు. నిజానికి ఇరాక్‌లో అధిక సంఖ్యాలకులు షియాలు అయినా తాను పాలకుడు కాబ్టటి సున్నీలకు పెత్తనం ఇచ్చాడు. మిగతా షియాలను, కుర్ద్ తెగలవారిని తీవ్రంగా అణచివేసే వాడు. తనకు ఎదురుతిరిగిన వారినే కాదు, ఎదురు తిరుగుతాడనే సందేహం కలిగినవారిని నిర్ధాక్ష్యణ్యంగా కాల్చి చంపేవాడు. అలా లక్షల మంది ఇరాకీల ప్రాణాలు బలి తీసుకున్నాడు.అయితే సద్దాం అమెరికా ఆధిపత్యాన్ని ప్రశ్నించిన నాయకుడు. అతను అధికారం చేపట్టక ముందు ఇరాక్‌లోని చమురు బావులన్నీ అమెరికన్ కంపెనీల చేతుల్లో ఉండేవి. వాటినన్నింటినీ జాతీయం చేయడం ద్వారా అమెరికాను ద్వేషించేవారి దృష్టిలో హీరో అయ్యాడు. దీంతో అమెరికా మాత్రం సద్దాంపై గురి పెట్టింది. తమ దగ్గర బయో వెపన్స్ ఉన్నాయన్న సద్దాం మాటతో అమెరికా ఐక్యరాజ్య సమితిపై ఒత్తిడి తెచ్చి ఇరాక్‌పై ఆంక్షలు విధించింది. దీంతో ఇరాక్ నాశనమైపోయింది. సద్దాం అధ్యక్ష భవనం నుంచి పారిపోయాడు. అమెరికా సేనలకు చిక్కుకుండా చాలాకాలం సద్దాం తలదాచుకున్నాడు. కానీ 2003లో సద్దాం దొరికిపోయాడు. మూడేళ్లు బంధీగా ఉన్న తర్వాత 2006లో సద్దాంను ఉరి తీశారు.ప్రపంచాన్ని హిట్లర్ గడగడలాడిస్తే.. హిట్లర్‌ను స్టాలిన్ వణికించాడు. అటువంటి రష్యా నేత స్టాలిన్‌కు కూడా రెండు పేర్లు ఉన్నాయి. కొంతమంది ఆయన్ని హీరో అంటే.. మరికొందరు కాదు విలనే అని వాదిస్తారు. 1917లో రష్యాలో విప్లవం విజయవంతమైన తర్వాత చాలాకాలం లెనిన్ నాయకత్వం కొనసాగింది. ఆయన తర్వాత స్టాలిన్ ఆ బాధ్యతలను తీసుకున్నాడు. అయితే స్టాలిన్ పాలనలో దారుణాలు, అరాచకాలు జరిగాయని చరిత్రకారులు చెబుతారు. ఆయన విధానాలు, శాసనాల వల్ల లక్షల మంది చనిపోయారనే ఆరోపణలున్నాయి.స్టాలిన్ సైన్యంలో అయినా, కమ్యూనిస్టు పార్టీలో అయినా ఎవరైనా తనను వ్యతిరేకిస్తే వారిని చంపించేవారు. పార్టీ సెంట్రల్ కమిటీలోని 139 మందిలో 93 మందిని స్టాలిన్ చంపించారనే ఆరోపణలు కూడా ఉన్నాయి. అంతే కాకుండా సైన్యంలోని 103 మంది జనరళ్లు, అడ్మిరల్‌లో 81 మందిని కూడా ఆయన చంపించారని చెబుతారు. 1953 మార్చి 5న గుండెపోటు రావడంతో స్టాలిన్ చనిపోయాడు. అతని మరణం కొందరిని కలచివేస్తే.. చాలామంది సంబరాలు జరుపుకున్నారు. ఇలా స్టాలిన్ హీరో కమ్ విలన్ అనిపించుకున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa