ఎప్పటికప్పుడు, యాప్స్ ను అప్డేట్ చేస్తూ సెక్యూరిటీ పరంగా కట్టుదిట్టంగా వుండే గూగుల్ ప్లే స్టోర్, ఇటీవల ప్లే స్టోర్ 11 యాప్స్ ని తొలగించింది. ఈ యాప్స్అన్ని కూడా వినియోగదారులకు హాని కలిగించే ప్రమాదమున్న Joker మాల్వేర్ బారిన పడడం వలన వాటిని తొలిగించినట్లు ప్రకటించింది.వాస్తవానికి, గూగుల్ అన్ని యాప్స్ పైన జోకర్ మాల్వేర్ ప్రభావాన్ని 2017 నుండి ట్రాక్ చేస్తోంది. అయితే, ఈ జోకర్ మాల్వేర్ ఎన్ని సార్లు తీసేసిన కూడా ఏదో ఒక రూపంలో తిరిగిరావడం ఆశ్చర్యకరమైన విషయంగా చెప్పొచ్చు.ప్రస్తుతం, గూగుల్ తొలిగించిన ఈ యాప్స్ లో జోకర్ మాల్వేర్ యొక్క కొత్త రకాన్ని కొనుగొన్నట్లు, చెక్‌పాయింట్ రీసెర్చర్లు చెబుతున్నారు. ప్రజలు తమకు తెలియకుండానే ప్రీమియం సర్వీస్ కు సభ్యత్వానికి డబ్బుచెల్లించడానికి సులువైన మార్గంగా, హ్యాకర్లు ఈ కొత్త మార్గాన్ని కనుగొన్నారు. ఈ యాప్స్ ద్వారా వెళ్ళే కొత్త మార్గం ద్వారా హ్యాకర్లు Google Play యొక్క సెక్యూరిటీని కూడా దాటవచ్చు. ప్లే స్టోర్‌లోని ఈ 11 యాప్స్ లో జోకర్ మాల్వేర్ కనుగొనబడింది. వెంటనే, గూగుల్ ఈ యాప్‌లన్నింటినీ ప్లే స్టోర్ నుంచి తొలగించినట్లు చెక్ పాయింట్ తెలిపింది. మీ Android ఫోన్‌లో ఈ యాప్స్ ఏవైనా ఉంటే, వెంటనే వాటిని తొలగించండి. ఈ జాబితాలో వున్న 11 యాప్స్ ఈ క్రింద చూడవచ్చు...
com.imagecompress.android
com.contact.withme.texts
com.hmvoice.friendsms
com.relax.relaxation.androidsms
com.cheery.message.sendsms (two different instances)
com.peason.lovinglovemessage
com.file.recovefiles
com.LPlocker.lockapps
com.remindme.alram
com.training.memorygame
గూగుల్ ప్లే యొక్క సెక్యూరిటీ ఫీచర్లు చాలా ఉన్నప్పటికీ, జోకర్ మాల్వేర్ ని గుర్తించడం చాలా కష్టం అని చెక్ పాయింట్, ప్రత్యేకంగా తెలిపింది. అందుకు ఉదాహరణగా, ఇది చాలా తెలివిగా గూగుల్ ప్లే స్టోర్‌లోకి తిరిగి రావడం గురించి చెప్పింది. ఈ సంవత్సరం ప్రారంభంలో, ప్లే స్టోర్‌లోని 1,700 హానికరమైన "బ్రెడ్" యాప్స్ ని గుర్తించి తొలగించినట్లు, గూగుల్ ఒక నివేదికలో పేర్కొంది. ఈ బ్రెడ్ యాప్స్ అని కూడా జోకర్ మాల్వేర్‌తో ఉన్నాయి. వినియోగదారులు డౌన్‌లోడ్ చేయడానికి ముందే ఈ యాప్‌లను తొలగించారని గూగుల్ తెలిపింది. గూగుల్ 2017 నుండి జోకర్ మాల్వేర్ను ట్రాక్ చేస్తోంది.
![]() |
![]() |
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa