మలేషియాలో మానవ ముఖంలాగా ఉన్న చేపలు బయటపడ్డాయి. మలేషియాలోని ఒక గ్రామానికి సమీపంలో ఉన్న నదిలో జాలర్లు వేటకు వెళ్లారు. వారి వలకు చేపలు చిక్కగా వాటిని బయటికి తీసి చూశారు. అందులో ఓ చేప మానవ ముఖం రూపంలో ఉంది. దీంతో షాకైన వారు అటవీశాఖాధికారులకు తెలిపారు. వాటిని పరిశీలించిన అధికారులు వీటిని ట్రిగ్గర్ ఫిష్ అని పిలుస్తారని చెప్పారు. ఈ రకం చేపలు ఎక్కువగా ఆగ్నేయాసియా జలాల్లో కనిపిస్తాయన్నారు. ఇంతకు ముందు ఇలాంటి చేపలు లండన్, దక్షిణ చైనాలో కూడా బయటపడ్డాయంట. ప్రస్తుతం ట్రిగ్గర్ ఫిష్ లకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa