ఇటీవల తమ సిబ్బందిని టిక్ టాక్ యాప్ వాడొద్దన్న అమెజాన్ తాజాగా ఆ ఆదేశాలపై వెనక్కి తగ్గింది. ఆ ప్రకటన పొరపాటు చేశామంటూ చెప్పుకొచ్చింది. తాము పంపే ఈ-మెయిల్స్‌లోని సమాచారం టిక్‌టాక్ ద్వారా తస్కరణకు గురయ్యే ప్రమాదం ఉందని, భద్రతా కారణాల దృష్ట్యా మొబైల్ ఫోన్ల నుంచి ప్రతి అమెజాన్ ఉద్యోగి ఆ యాప్‌ను తొలగించాలని ఇటీవల ఈ-మెయిల్స్ ద్వారా ఆదేశాలు జారీ చేసింది.ల్యాప్ టాప్ లలో మాత్రం టిక్‌టాక్‌ను వాడొచ్చని తెలిపింది. అయితే, ఈ ఆదేశాలను ఉపసంహరించుకుంటున్నట్లు తాజాగా మరో ప్రకటనలో పేర్కొంది. తమ ఉద్యోగుల్లో కొందరికి ఈ-మెయిల్స్ తప్పుగా పంపించామని, ఆ యాప్‌కు సంబంధించి ప్రస్తుతం తమ విధానాల్లో ఎలాంటి మార్పు లేదని అమేజాన్ స్పష్టం చేసింది. టిక్‌టాక్‌పై విధించిన బ్యాన్‌ను వెనక్కి తీసుకోవడానికి కారణాన్ని చెప్పడానికి అమెజాన్ ప్రతినిధి జాకీ అండర్సన్ సుముఖత వ్యక్తం చేయలేదు.
![]() |
![]() |
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa