ఐబీపీఎస్ ఆర్‌ఆర్‌బీ (రీజనల్ రూరల్ బ్యాంక్స్) 2020 నోటిఫికేషన్ విడుదలైంది. ఈ ప్రకటన ద్వారా దాదాపు 9698 పీవో, క్లర్క్ ఉద్యోగాలు భర్తీ చేయనున్నారు. జులై 1, 2020 నుంచి దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం కానుంది. జులై 21, 2020 దరఖాస్తుకు చివరితేదీ. ఆసక్తి గల వారు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. ప్రిలిమినరీ, మెయిన్ పరీక్షలు, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ఉంటుంది. పూర్తి వివరాలు ibps.in/ వెబ్‌సైట్‌లో చూడొచ్చు. రాష్ట్రాల వారీగా ఖాళీల వివరాలు నోటిఫికేషన్‌లో వివరంగా ఇచ్చారు. దరఖాస్తుల ప్రక్రియ కొనసాగుతుంది. అన్ని రాష్ట్రాల వారు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు.
విభాగాల వారీ ఖాళీలు: 9698
ఆఫీస్ అసిస్టెంట్ – 4682
ఆఫీసర్ స్కేల్ I – 3800
ఆఫీసర్ స్కేల్ II (General Banking Officer) – 838
ఆఫీసర్ స్కేల్ II (Agricultural Officer) – 100
ఆఫీసర్ స్కేల్ II (IT) – 59
ఆఫీసర్ స్కేల్ II (Law) – 26
ఆఫీసర్ స్కేల్ II (CA) – 26
ఆఫీసర్ స్కేల్ II (Marketing Officer) – 8
ఆఫీసర్ స్కేల్II (Treasury Manager) – 3
ఆఫీసర్ స్కేల్ III – 156
ముఖ్యతేదీలు:
దరఖాస్తులు ప్రారంభం: జులై 1, 2020
దరఖాస్తుకు చివరితేదీ: జులై 21, 2020
ఆన్‌లైన్ ఎగ్జామ్స్ (ప్రిలిమినరీ): సెప్టెంబర్/అక్టోబర్ 2020
ప్రిలిమినరీ పరీక్షల ఫలితాలు: అక్టోబర్, 2020
మెయిన్స్ పరీక్షలు: అక్టోబర్/నవంబర్, 2020
వయసు:
ఆఫీస్ అసిస్టెంట్ (Multipurpose): 18 -28 ఏళ్ల మధ్య ఉండాలి.
ఆఫీసర్ స్కేల్- III (Senior Manager): 21-40 ఏళ్ల మధ్య ఉండాలి.
ఆఫీసర్ స్కేల్- II (Manager): 21-32 ఏళ్ల మధ్య ఉండాలి.
ఆఫీసర్ స్కేల్- I (Assistant Manager): 18-30 ఏళ్ల మధ్య ఉండాలి.
వేతనం: నెలకి రూ.15000 to 44000
సంస్థ వెబ్‌సైట్: ibps.in/
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa