దేశంలో కరోనా కేసులు రోజురోజుకూ పెరుగుతుండడంతో ప్రజల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. తుమ్మితే కరోనా వచ్చినట్లేనా? దగ్గితే కరోనా ఉన్నట్లేనా? అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. డాక్టర్.షేక్ ఖాజా పీర్ గారి నుంచి సమాధానాలు అందిస్తున్నాం.
ప్రశ్న: కరోనా వచ్చిన మనిషి తిరిగిన ప్రాంతంలో తిరిగితే కరోనా వస్తుందా?
జవాబు: జాగ్రత్తలు పాటిస్తే ప్రమాదం ఉండదు. ఎక్కడికి వెళ్లినా మాస్కులు ధరించడం, ఎప్పటికప్పుడు చేతులను శానిటైజ్ చేసుకోవడం లాంటివి చేసుకుంటే ఇబ్బంది ఉండదు. తప్పనిసరి పరిస్థితుల్లో మాత్రమే బయటకు వెళ్లడం మంచిది.
ప్రశ్న: నాకు 15 రోజుల నుంచి శ్వాస సమస్య వస్తుంది. మందులు వాడినా తగ్గడం లేదు? నాకు అస్తమా ఉంది?
జవాబు: అస్తమా వల్లనే కావొచ్చు. భయపడొద్దు. ఇతర లక్షణాలు కనిపిస్తేనే కరోనా గురించి ఆలోచించండి. మళ్లీ ఒక సారి డాక్టరును సంప్రదించండి.
ప్రశ్న: కరోనా పాజిటీవ్ వచ్చిన వారు కోలుకుని నెగటీవ్ వచ్చిన తర్వాత వారిని కలవచ్చా?
జవాబు: నెగటీవ్ వచ్చిన తర్వాత 14 రోజుల తర్వాత కలవడం మంచిది.
ప్రశ్న: మా భర్తకు 5 రోజులుగా గొంతు ఇన్ఫెక్షన్. దగ్గు వస్తుంది. కరోనా పరీక్షలు చేయించాలా?
జవాబు: గొంతు ఇన్ఫెక్షన్ తో భయపడాల్సిన పని లేదు. ఇతర లక్షణాలు కనిపించినప్పుడే కరోనా గురించి ఆలోచించండి. అనుమానం ఉంటే పరీక్షలు చేయించుకుని నివృత్తి చేయించుకోండి.
ప్రశ్న: నాకు వారం నుంచి చెస్ట్ పెయిన్ వస్తుంది. జలుబు ఉంది. ఆర్ఎంపీ కి చూపిస్తే నంజు అన్నారు. తలనొప్పి కూడా ఉంది. కరోనా అంటారా?
జవాబు: ఇవి కరోనా లక్షణాలు కాదు. భయపడకండి
ప్రశ్న: మూడు రోజుల నుంచి తలనొప్పి, నీరసం, జ్వరం వచ్చినట్లు ఉంది?
జవాబు: జ్వరం ఎంతకూ తగ్గకపోవడం. ఇతర లక్షణాలు కూడా కనిపించినప్పుడు మాత్రమే కరోనా గురించి ఆలోచించండి.
ప్రశ్న: నాకు ఎడమ కన్ను ఎర్రగా అయ్యింది. కరోనా అంటారా?
జవాబు: కన్ను ఎర్రగా ఉన్నంత మాత్రాన కరోనా కాదు. అనవసరంగా భయపడొద్దు.
ప్రశ్న: చనిపోయిన వారిలో వైరస్ ఆరు గంటలు మాత్రమే ఉంటుంది అంటున్నారు. మరి ఆ తర్వాత శవాన్ని బంధువులకు ఎందుకు ఇవ్వడం లేదు?
జవాబు: ఎట్టి పరిస్థితుల్లోనూ వైరస్ వ్యాప్తి చెందవద్దన్న ముందు జాగ్రత్త చర్యగా ఇవ్వడం లేదు.
ప్రశ్న: నాకు అస్తమా ఉంది. తుమ్ములు ఆయసం కూడా వస్తున్నాయి. నిత్యం ఇన్ హెల్లర్ వాడుతా. నాకు థైరాయిడ్ కూడా ఉంది. కరోనా రాకుండా నేను ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
జవాబు: కోల్డ్ వాటర్, తీపి, పులుపు ఉండే పదార్థాలు తీసుకోకపోవడం, సరైనంత నిద్రపోవడం, ఇమ్యునిటీని పెంచే ఆహారం తీసుకోవడం మంచిది.
ప్రశ్న: ఎవరైనా మన నెత్తి మీద చేతులు పెట్టి దీవించినప్పుడు కరోనా వస్తుందా?
జవాబు: వచ్చే అవకాశం ఉంటుంది. ఇలాంటి పనులు ఈ సమయంలో చేయకపోవడం మంచిది.
ప్రశ్న: ఇంట్లో ఒక్కరికి కరోనా వస్తే అందరికీ వస్తుందా?
జవాబు: ఖచ్చితంగా వస్తుంది అని చెప్పలేం. కానీ ఇంట్లో ఒకరికి వస్తే మిగతా వారు కూడా ముందు జాగ్రత్తగా పరీక్షలు చేయించుకోవడం మంచిది.
ప్రశ్న: జ్వరం వచ్చింది కానీ తగ్గింది. దగ్గు వస్తుంది. ఇటీవల నేను కరోనా వచ్చిన వారిని కలిశాను?
జవాబు: ఇతర లక్షణాలు కనిపిస్తే అప్పుడు పరీక్షలు చేయించుకోండి. 14 రోజుల వరకు జాగ్రత్తగా ఉండడం మంచిది.
ప్రశ్న: మేము ఇటీవల లాయర్ దగ్గరకు వెళ్లి వచ్చాం. పేపర్లు ఇస్తే సంతకం పెట్టి ఇచ్చారు. వెంటనే శానిటైజర్ తో చేతులు శుభ్రం చేసుకున్నాం. ఆ సమయంలో వాళ్లు దగ్గలేదు, తుమ్మలేదు. తర్వాత రోజు వాళ్ల ఇంట్లో అందరికీ కరోనా వచ్చింది. మాకేమన్న సమస్యా?
జవాబు: మాస్కు లేకుండా మాట్లాడడం. ఆ పరిసరాల్లో ఎక్కువ సేపు ఉండడం చేస్తే వచ్చే అవకాశం ఉంటుంది. మీరు చెప్పిన దాని ప్రకారం మీకు వచ్చే అవకాశం లేదు. కానీ 14 రోజుల వరకు జాగ్రత్తగా ఉండడం మంచిది.
ప్రశ్న: నాకు ఫ్యాన్సీ షాపు ఉంది. కరోనా రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
జవాబు: మాస్కు ఉన్న వారిని మాత్రమే షాపులోనికి రానివ్వండి. రాగానే చేతికి శానిటైజర్ ఇవ్వండి. డబ్బులు తీసుకుంటే వెంటనే మీ చేతులకు శానిటైజర్ రాసుకోండి.
ప్రశ్న: రోగనిరోధక శక్తిని ఎలా పెంచుకోవాలి?
జవాబు: ప్రోటీన్స్ ఉండే ఆహారం తీసుకోవాలి. సరైనంతగా నిద్ర పోవాలి.
ప్రశ్న: గత నెల 19న నేను మా అబ్బాయి వాళ్ల ఇంటికి వెళ్లాం. 28న మా కోడలు కరోనాతో చనిపోయింది. తర్వాత పరీక్షలు చేయించుకుంటే నాకు నెగటీవ్, మా అబ్బాయికి పాజిటీవ్ వచ్చింది. నేను ఇప్పుడు మా ఊరు వచ్చేశాను. నేను ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి.
జవాబు: 14 రోజుల వరకు ఎక్కువగా ఎవరినీ కలవకండి. మంచి బలమైన ఆహారం తీసుకోండి. మానసికంగా దృఢంగా ఉండండి.
ప్రశ్న: శానిటైజర్ ఒక సారి పూస్తే ఎంతసేపు పని చేస్తుంది?
జవాబు: శానిటైజర్ రాసుకుంటే అప్పటివరకు మన చేతిమీద ఉన్న వైరస్, బ్యాక్టీరియా మాత్రమే చనిపోతాయి. మళ్లీ ఏదైనా వస్తువును ముట్టుకుంటే మళ్లీ రాసుకోవడం మంచిది.
ప్రశ్న: నాకు బట్టల షాప్ ఉంది. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి.
జవాబు: మాస్కు ఉన్న వారిని మాత్రమే లోనికి రానివ్వండి. రాగానే శానిటైజర్ ఇవ్వండి. గతంలో లాగా చాలా బట్టలు చూపించడం, ఎక్కువ సేపు ముచ్చటించడం మంచిది కాదు. వచ్చిన వారు వెళ్లిన తర్వాత వారు చూసిన బట్టలపై శానిటైజర్ ను స్ప్రే చేయడం మంచిది.
ప్రశ్న: కరోనా పేషెంట్ ను కుట్టిన దోమ మనలను కుడితే కరోనా వస్తుందా?
జవాబు: రాదు.
ప్రశ్న: జలుబు మూడు రోజుల క్రితం వచ్చి తగ్గి పోయింది. దగ్గు మాత్రం తగ్గలేదు. కరోనా అంటారా?
జవాబు: కాదు.
ప్రశ్న: కరోనా వచ్చిన వారి ఫోన్ టచ్ చేస్తే కరోనా వస్తుందా?
జవాబు: వచ్చే అవకాశం ఉంటుంది.
ప్రశ్న: కరోనా వచ్చిన వారిని ముట్టుకుంటే కరోనా వస్తుందా?
జవాబు: ఆ సమయంలో వారి చెమట, తుంపర్లు మీకు తాకితే వచ్చే అవకాశం ఉంటుంది. సాధ్యమైనంత వరకు సామాజిక దూరం పాటించడం మంచిది
ప్రశ్న: కూరగాయలు, సరుకులపై హైపోక్లోరైడ్ ద్రావణం పిచికారీ చేయడం మంచిదా? కూరగాయలను చల్లని నీటితో కడిగితే మంచిదా, లేక పోతే వేడి నీటితో కడగడం మంచిదా?
జవాబు: రసాయనాలు పిచికారీ చేస్తే వెంటనే మళ్లీ నీటితో శుభ్రం చేసుకోవాలి. వేడి నీళ్లతో కడగడమే మంచిది.
ప్రశ్న: మూడు రోజుల నుంచి జ్వరం వస్తూ తగ్గిపోతోంది. గొంతు ఇన్ఫెక్షన్ కూడా ఉంది. ఏదైనా సమస్యా?
జవాబు: ఇతర లక్షణాలు కూడా వస్తే పరీక్షలు చేయించుకోండి.
ప్రశ్న: నాకు జలుబు, తుమ్ములు, లైట్ గా జ్వరం ఉంది?
జవాబు: తగ్గకుండా పెరుగుతూ ఉంటే డాక్టరును సంప్రదించండి
![]() |
![]() |
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa