కర్నూలు జిల్లాలో కరోనా వైరస్ మృత్యుఘంటికలు మోగిస్తోంది. జిల్లాలో తిష్టవేసుకుని కూర్చున్న మహమ్మారి ప్రజలపై విరుచుకుపడుతుంది. ఇప్పటికే అనేకమందిని మంచాన పడేసిన రక్కసి తాజాగా మరో ముగ్గురిని బలితీసుకుంది. దాంతో జిల్లాలో కరోనా వైరస్ బారినపడి మృతి చెందిన వారి సంఖ్య 88కి చేరుకున్నాయి. ఇకపోతే జిల్లాలో రోజు రోజుకు కరోనా వైరస్ విలయతాండవం చేస్తుండటంతో ప్రజలు భయంతో హడలెత్తిపోతున్నారు.లాక్ డౌన్ సడలింపులు తర్వాత ఈ కేసులు పెరుగుతుండటంతో సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతుంది. ఒకప్పుడు ఢిల్లీ లింకులు..ఆ తర్వాత చెన్నై కోయంబేడు మార్కెట్ లింకులు...తాజాగా కువైట్ లింకులు ఇలా కరోనా వైరస్ జిల్లాలో చాపకింద నీరులా విస్తరిస్తోంది. ఇకపోతే రాష్ట్రంలో 264 మంది మృతి చెందారు. బుధవారం ఒక్కరోజే 12 మంది మృత్యువాత పడ్డారు.కర్నూలు జిల్లాలో ముగ్గురు..కృష్ణా జిల్లాలో ఇద్దరురు..గుంటూరు జిల్లాలో ఒక్కరు.. అనంతపురంలో ఇద్దరు, పశ్చిమగోదావరి లో ఇద్దరు, చిత్తూరులో ఒక్కరు మరియు విశాఖపట్టణంలో ఒక్కరు చనిపోయారు. రాష్ట్రంలోఅత్యధికంగా కర్నూలు జిల్లాలో 88 మంది కరోనాకు బలవ్వగా ఆ తర్వాత కృష్ణా జిల్లాలో 72 మంది చనిపోయారు. దాంతో కరోనా మరణాలలో కర్నూలు జిల్లా మొదటి స్థానంలో ఉంది. ఒకవైపు ప్రతీ రోజూ డబుల్ డిజిట్ సంఖ్యలో కరోనా కేసులు నమోదు అవుతుండటం....మరోవైపు మృతులు కూడా అలాగే పెరుగుతుండటంతో జిల్లాలో ఆందోళన నెలకొంది.
![]() |
![]() |
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa