దక్షిణాది నటి భావనపై జరిగిన దారుణాన్ని ఖండిస్తూ నటి రాయ్ లక్ష్మి సామాజిక మాధ్యమాల ద్వారా తన సందేశాలను పోస్ట్ చేసింది. ఈ సంఘటన నిజం కాకూడదని కోరుకుంటున్నానని, ఒకవేళ ఈ సంఘటన నిజమే అయితే, మన గళం విప్పాల్సిన సమయం వచ్చిందని, ఇకపై ఎవరినైనా ఎలా నమ్మగలం?, భద్రత అనే పదానికి ఇప్పుడు అర్థమే లేదని, భావన సురక్షితంగా ఉండాలని కోరుకుంటున్నానని తన పోస్ట్ లో పేర్కొంది. కాగా, భావవ స్నేహితు రాలు భామ కూడా స్పందించారు. ఇటువంటి విషయాలను ఏ హీరోయిన్ బయటకు చెప్పుకోలేదని, నిందితులిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేసింది.