కరోనా వైరస్ ఉధృతి నేపథ్యంలో జేఈఈ మెయిన్స్, నీట్ పరీక్షలు వాయిదా పడ్డాయి. పరీక్షలను వాయిదా వేస్తూ కేంద్ర మానవ వనరుల శాఖ శుక్రవారం ప్రకటన విడుదల చేసింది. షెడ్యూల్ ప్రకారం జేఈఈ పరీక్ష జూలై 19-23 వరకు, నీట్ పరీక్ష జూలై 26న జరగాల్సి ఉంది. దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతుండటంతో మానవ వనరుల శాఖ పరీక్షలు వాయిదా వేసింది. సెప్టెంబర్ 1 నుంచి 6వ తేదీ వరకూ జేఈఈ మెయిన్స్, సెప్టెంబర్ 13కు నీట్ పరీక్షలు వాయిదాపడ్డాయి. అలాగే జేఈఈ అడ్వాన్స్‌డ్ పరీక్ష సెప్టెంబర్ 27కి వాయిదా పడింది.
![]() |
![]() |
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa