ప్రాణానికి ప్రాణంగా చూసుకున్న యజమాని ఇక లేదని తెలియడంతో ఓ శునకం పరుగు పరుగున భవనం నాలుగో అంతస్తు పైకి చేరి అక్కడి నుంచి దూకేసింది. అక్కడికక్కడే మరణించింది. ఉత్తర్ ప్రదేశ్‌లోని కాన్పూర్ నగరంలో ఈ ఘటన చోటు చేసుకుంది. కాన్పూర్‌లో వైద్య శాఖలో జాయింట్ డైరెక్టర్‌గా పనిచేస్తున్న డాక్టర్ అనితా రాజ్ సింగ్ 12 ఏళ్ల కిందట ఓ కుక్క పిల్లను ఇంటికి తెచ్చుకున్నారు. పుట్టిన ఒకట్రెండు రోజుల్లోనే తల్లి నుంచి విడిపోయిన ఆ కుక్క పిల్ల పోషణ లేక చిక్కి శల్యమైంది. దాని శరీరం చుట్టూ కీటకాలు ముసిరాయి. అలాంటి స్థితిలో ఆ కుక్క పిల్లను తీసుకొచ్చిన డాక్టర్ అనిత దానికి సపర్యలు చేసి ప్రాణాలు నిలిపారు. దానికి ‘జయ’ అని పేరు పెట్టి కుటుంబంలో ఓ సభ్యురాలిగా పెంచుకున్నారు.అనారోగ్య కారణాలతో డాక్టర్ అనితా సింగ్‌ను కొద్ది రోజుల కిందట ఆస్పత్రిలో చేర్పించారు. నాటి నుంచి ఆ శునకం ఇంట్లో దిగాలుగా కూర్చుంది. యజమాని ఆరోగ్యం గురించి బెంగ పెట్టుకుంది. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ డాక్టర్ అనితా సింగ్ ఆరోగ్యం క్షీణించడంతో బుధవారం (జులై 1) ప్రాణాలు విడిచారు. ఆమె మృతదేహాన్ని కాన్పూర్‌లోని బరా-2 పరిధిలోని మాలిక్‌పురంలో ఉన్న ఆమె నివాసానికి తీసుకొచ్చారు. 12 ఏళ్లుగా తనను పెంచి పోషించిన యజమానిని విగతజీవిగా చూడగానే ఆ శునకం దిగ్భ్రాంతికి గురైంది. భవనం నాలుగో అంతస్తు పైకెక్కి అక్కడ నుంచి ఒక్కసారిగా దూకేసింది. శునకం ప్రాణాలు తీసుకుందని తెలియడంతో స్థానికులు అక్కడికి పోటెత్తారు. వైద్యురాలిపై ఆ మూగజీవి పెంచుకున్న ప్రేమను చూసి షాక్‌కు గురయ్యారు. కుక్క మృతదేహాన్ని ఇంటికి సమీపంలోనే పూడ్చిపెట్టారు.
![]() |
![]() |
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa