ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఇంటర్నేషనల్ క్రికెట్‌కు ఆఫ్రిది గుడ్‌బై

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Feb 20, 2017, 10:39 AM

హైదరాబాద్: పాకిస్థాన్ ఆల్‌రౌండర్, డాషింగ్ బ్యాట్స్‌మన్ షాహిద్ ఆఫ్రిది అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పాడు. పాక్ విజయాలలో కీలక పాత్ర పోషించిన ఆఫ్రిది, ఆల్‌రౌండర్‌గా కూడా జట్టుకు అనేక సేవలందించాడు. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా అన్ని జట్లలోనూ యువకులు అదరగొడుతుండడంతో, తను కూడా రిటైర్మెంట్ తీసుకోని కొత్త వారికి అవకాశం కల్సించే ఉద్దేశంతో అంతర్జాతీయ క్రికెట్ నుంచి తప్పుకున్నాడని క్రికెట్ పండితులు భావిస్తున్నారు. 1996లో కెన్యాపై జరిగిన మ్యాచ్‌తో ఆఫ్రిది ఆరంగ్రేటం చేశాడు. ఇప్పటి వరకు 27 టెస్టులు, 398 వన్డేలు, 98 టీ20 మ్యాచ్‌లు ఆడాడు. వన్డేల్లో 351 సిక్సర్లతో షాహిద్‌ ఆఫ్రిది రికార్డు నెలకొల్పారు. 1996లో శ్రీలంకపై 37 బంతుల్లో సెంచరీ చేసి వేగంగా సెంచరీ చేసిన బ్యాట్స్‌మెన్‌గా రికార్డు సంపాదించాడు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com