దేశంలో కరోనా కేసులు రోజురోజుకూ పెరుగుతుండడంతో ప్రజల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. తుమ్మితే కరోనా వచ్చినట్లేనా? దగ్గితే కరోనా ఉన్నట్లేనా అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
ప్రశ్న: నాకు ఐదు రోజుల నుంచి దగ్గు, జలుబు రెండు రోజుల నుంచి ఉంది. జ్వరం, ఆయసం లాంటి లక్షణాలేవీ లేదు. నాకు ఒక వేళ కరోనా ఉంటే ఈ లక్షణాలు బయటపడడానికి ఎన్ని రోజులు పడుతుంది?
జవాబు: మీకు దగ్గు, జలుబు ఉన్నాయి కాబట్టి.. కరోనా ఉంటే దాదాపు వారం రోజుల్లో జ్వరం, ఆయాసం లాంటి లక్షణాలు బయటపడతాయి.
ప్రశ్న; నాకు దగ్గు వస్తుండడంతో కరోనా పరీక్షలు చేయించడంతో కరోనా నెగటీవ్ వచ్చింది. మళ్లీ కాఫ్ వస్తుంది. కారణం?
జవాబు: సాధారణ దగ్గే కావొచ్చు. డాక్టరును సంప్రదించండి.
ప్రశ్న: గ్లౌజులను వేసుకుని డబ్బులను తీసుకుంటున్నాను. ఆ డబ్బులను ఎన్ని రోజులు పక్కకు పెడితే మంచిది?
జవాబు: నాలుగు రోజుల వరకు పెడితే మంచిది. ఇప్పుడు యూవీ రేస్ బాక్సులు మార్కెట్లోకి వస్తున్నాయి. అందులో 15 నిమిషాలు డబ్బులు ఉంచి.. తర్వాత వాడుకుంటే ఏ సమస్య ఉండదు. కుదరకపోతే ఆ డబ్బులను వాడిన ప్రతీ సారి చేతులను శానిటైజ్ చేసుకోవడం మంచిది.
ప్రశ్న: బట్టలపై కరోనా ఎన్ని రోజులు ఉండే అవకాశం ఉంటుంది.
జవాబు: రెండు లేదా మూడు రోజుల వరకు ఉంటుంది. ఎప్పటికప్పుడు బట్టలను ఉతుక్కోవడం మంచిది.
ప్రశ్న: ఎలాంటి లక్షణాలు లేకున్నా కరోనా వస్తుందంటున్నారు. లక్షణాలు లేని వారికి కరోనా వచ్చిన విషయం ఎలా తెలుసుకోవాలి?
జవాబు: లక్షణాలు లేని వారిని గుర్తించడం కష్టం. అలాంటి వారిలో పరీక్షలు చేసినప్పుడు మాత్రమే కరోనా సోకిందా? లేదా? అన్న విషయం బయట పడుతుంది.
ప్రశ్న: దోమల వల్ల కరోనా వచ్చే అవకాశం ఉందా
జవాబు: లేదు
ప్రశ్న: రెండు నెలలుగా గొంతులో ఇబ్బందిగా ఉంది. కరోనా అంటారా?
జవాబు: లేదు. కరోనా అయితే మీకు 14 రోజుల లోపే లక్షణాలు బయటపడేవి. ఇతర సమస్య కావొచ్చు.
ప్రశ్న: మొబైల్ ఫోన్ తో కరోనా వచ్చే అవకాశం ఉందా?
జవాబు: ఉంది. మన ఫోన్ ను వేరే వారికి ఇవ్వడం, ఫోన్ పై కరోనా వచ్చిన వారి తుంపర్లు పడితే మీకు వచ్చే అవకాశం ఉంటుంది.
ప్రశ్న: నేను హైదరాబాద్ కు వచ్చిన రెండో రోజు జ్వరం వచ్చింది. జలుబు ఒక రోజు వాటర్ లా వచ్చి బంద్ అయ్యింది. ప్రస్తుతం భోజనం చేసిన తర్వాత లో ఫివర్ వస్తుంది. కాళ్లలో కొద్దిగా నొప్పిగా ఉంటుంది. కరోనా అంటారా?
జవాబు: ప్రయాణం చేశారు కాబట్టి తగ్గక పోతే ఒక సారి డాక్టరును సంప్రదించడం మంచిది.
ప్రశ్న: మార్కెట్లో నేను 16 రోజుల క్రితం కూరగాయలు కొన్న వ్యక్తికి ఇప్పుడు కరోనా వచ్చిందని తెలిసింది. నాకు ఏమైనా ప్రమాదమా?
జవాబు: లేదు. ఒక వేళ మీకు వైరస్ సోకితే 14 రోజుల్లోనే బయట పడేది.
ప్రశ్న: కాళ్లు చేతులు లాగుతున్నాయి. గుండెల్లో మంటగా ఉంది. ఏదైనా సమస్యా?
జవాబు: కరోనా కాదు. ఇతర సమస్య కావొచ్చు.
ప్రశ్న: 20 రోజుల నుంచి గొంతులో నొప్పిగా ఉంది. వేరే లక్షణాలు లేవు?
జవాబు: కరోనా కాదు.
ప్రశ్న: రెండు రోజుల నుంచి గొంతు నొప్పి, ఛాతిలో మంట వస్తుంది. వేడి నీళ్లు తాగితే గొంతు నొప్పి పోయింది. ఛాతి మంట అలానే ఉంది. వాతావరణంలో మార్పు వస్తే కొంచెం దగ్గు వస్తుంది?
జవాబు: గ్యాస్ సమస్య కావొచ్చు. వాతావరణంలో మార్పులతో వచ్చే దగ్గు కరోనా కాదు.
ప్రశ్న: 3 రోజుల నుంచి గొంతు నొప్పి ఉంది, కరోనా అయ్యే అవకాశం ఉందా?
జవాబు: జ్వరం, దగ్గు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది లాంటి ఇతర లక్షణాలు కనిపిస్తేనే కరోనా గురించి ఆలోచించండి.
ప్రశ్న: రెండు నెలల క్రితం జలుబు, జ్వరం వచ్చింది. ఇప్పటి దాక వాసన లేదు?
జవాబు: జలుబు, జ్వరం వచ్చిన సమయంలో ఎక్కువ డోస్ ఉన్నటాబ్లెట్ వేసుకుంటే ఇలాంటి సమస్యలు వస్తాయి. ఈ సమస్య దానంతట అదే తగ్గిపోతుంది.
ప్రశ్న: డబ్బులు ప్యాకెట్లో పెట్టుకోవడం ద్వారా కరోనా వస్తుందా?
జవాబు: ఎప్పటికప్పుడు చేతులు శానిటైజ్ చేసుకోవడం, బట్టలు ఉతుక్కోవడం చేయడంతో కరోనా రాకుండా చూసుకోవచ్చు.
ప్రశ్న: నాకు జ్వరం, ఒళ్లు నొప్పులు ఉన్నాయి. టాబ్లెట్స్ వాడితే మూడు రోజుల తర్వాత తగ్గాయి. ఏం పర్వాలేదా?
జవాబు. పర్వాలేదు.
ప్రశ్న: కరోనా ఎన్ని రోజులకు తగ్గుతుంది?
జవాబు: ఇమ్యూనిటీ అధికంగా ఉన్న వారికి 14 రోజుల్లో తగ్గిపోతుంది. లేక పోతే ఇంకా ఎక్కువ సమయం పడుతుంది. మానసిక స్థితిపై కూడా ఇది ఆధారపడుతుంది.
ప్రశ్న:నిన్న సాయంత్రం నుంచి పొడి దగ్గు, జలుబు, జ్వరం ఉన్నాయి. మందులు వేసుకుంటే ఇప్పుడు బాగానే ఉంది. ఏదైనా ప్రమాదమా?
జవాబు: మళ్లీ రాకపోతే పర్వాలేదు. మళ్లీ దగ్గు, జలుబు, జ్వరం వస్తే ఆలోచించండి.
ప్రశ్న: వారం నుంచి వాసన తెలియడం లేదు. పిట్రోల్ వాసన కూడా?
జవాబు: కరోనా కాదు. ఒక సారి డాక్టరును సంప్రదించండి.
ప్రశ్న: నాకు పొడి దగ్గు గొంతు నొప్పి ఉంది. వేడి నీళ్లు తాగితే మరుసటి రోజు కాస్త నయంగా ఉంది. ఓకేనా?
జవాబు: మళ్లీ వస్తే ఆలోచించండి. లేక పోతే పర్వాలేదు.
ప్రశ్న: నేను దుబాయి నుంచి రాగానే హైదరాబాద్ లో 8 రోజులు, 7 రోజులు హోం క్వారంటైన్ లో ఉన్నా. లక్షణాలేమీ లేవు. మళ్లీ పరీక్షలు చేయించుకోవాలా?
జవాబు: అవసరం లేదు.
ప్రశ్న: నేను ట్రావెల్ చేసి వచ్చి కరోనా పరీక్షలు చేయించుకుని వారం అవుతోంది. అప్పుడు నెగటీవ్ వచ్చింది. ఇప్పటివరకు నాకు లక్షణాలేమీ లేవు. నేను బయటకు వెళ్లొచ్చా?
జవాబు: వెళ్లొచ్చు.
ప్రశ్న: నేను హౌస్ వైఫ్. బయటకు వెళ్లను. లైట్ గా దగ్గులు, అప్పుడప్పుడు తుమ్ములు వస్తున్నాయి. ఏమైనా సమస్యా?
జవాబు: ఇతర లక్షణాలు కనిపిస్తే అప్పుడు ఆలోచించండి.
ప్రశ్న: గ్యాస్ సమస్య వల్ల గొంతులో మంట ఉంటదా?
జవాబు: ఉంటుంది.
ప్రశ్న: గ్లౌజులు వేసుకుంటే కరోనా రాదా?
జవాబు: గ్లౌజులతో పాటు మాస్కు ధరించడం, సామాజిక దూరం పాటించడం లాంటివి చేయడం లాంటివి చేయడం ద్వారా కరోనా నుంచి కాపాడుకోవచ్చు.
ప్రశ్న: జలుబు ఒక్కటే ఉంటే కరోనా ఉన్నట్లేనా?
జవాబు: ఇతర లక్షణాలు ఉన్నప్పుడే కరోనా గురించి ఆలోచించండి.
ప్రశ్న: నాకు జ్వరంగా ఉంది. తల బరువుగా ఉంటుంది. బద్దకంగా ఉంటుంది. శరీరం మొత్తం తిప్పినట్లు, పడి పోతున్నట్లు అవుతుంది?
జవాబు: ఒక సారి డాక్టరును సంప్రదించండి.
ప్రశ్న: పప్పు, ఉప్పు, కారం, పిండి లాంటి నిత్యావసరాలను శానిటైజ్ చేయడం ఎలా?
జవాబు: కవర్ ప్యాకింగ్ తో వస్తే పై నుంచి కడుక్కోవచ్చు. లేక పోతే ఒక రెండు మూడు రోజులు ఇంట్లో ఓ పక్కకు పెట్టి వాడుకోవడం మంచిది.
ప్రశ్న: గొంతులో భారంగా బరువుగా ఉంటుంది.
జవాబు: ఇతర లక్షణాలు ఏమైనా కనిపిస్తేనే కరోనా గురించే ఆలోచించండి.
![]() |
![]() |
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa