వైసీపీ ప్రభుత్వ హయాంలో రాష్ట్ర అభివృద్ధి కుంటుపడిందని, రాష్ట్రానికి రావాల్సిన పరిశ్రమలు వెళ్ళిపోయాయని టీడీపీ ఎమ్మెల్సీ అశోక్ బాబు విమర్శించారు. గత ప్రభుత్వం చంద్రబాబు హయాంలో ఎన్ని పరిశ్రమలు వచ్చాయి.. ఎంతమందికి ఉద్యోగాలు ఇచ్చింది..అప్పుడు ప్రతిపక్షంగా ఉన్న వైసీపీ అసెంబ్లీలో ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పిన విషయాన్ని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. అందుచేత గత ప్రభుత్వాన్ని నిందించే ప్రయత్నం మానుకోవాలని అశోక్ బాబు సూచించారు. మీరు మా వైపు ఒక వేలు చూపిస్తే.. మీ వైపు నాలుగు వేళ్లు చూపిస్తున్నాయని’ అశోక్ బాబు అన్నారు. ఉద్యోగులకు ఇన్సెంటివ్స్ 2000 - 2015 ఏపీ ఇండస్ట్రియల్ పాలసీ ప్రకారం ఇస్తున్నారా? లేక వైసీపీ పాలసీ ప్రకారం ఇస్తున్నారా? దీనికి సమాధానం చెప్పాలని ఆ శాఖ మంత్రిని డిమాండ్ చేశారు. కొత్త ఇండస్ట్రీకి ఇచ్చే పాలసీ గురించి ఏడాది అయినా ఇంతవరకు తయారు చేయలేకపోయారని ఎద్దేవా చేశారు.
![]() |
![]() |
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa