టీవీల్లో క్రైమ్ వార్తలు చూసి ప్రేరణ పొందిన ఓ హర్యానా వాసి (సోనిపట్) ప్రముఖ టిక్‌టాక్ స్టార్‌ను హత్య చేశాడు. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. సోనిపట్‌లో బ్యూటీ పార్లర్ నడుపుతున్న శివానీ ఖుబియాన్‌ను టిక్‌టాక్‌లో 1 లక్ష మందికి పైగా ఫాలో అవుతున్నారు. ఆమె ఆ చుట్టు పక్కల గ్రామాల్లో తన వీడియోలతో చాలా పాపులర్‌గా మారింది. అయితే తన పొరుగింట్లో ఉంటున్న ఆరీఫ్ కొంత కాలంగా ఆమెను ప్రేమిస్తున్నానంటూ వేధిస్తున్నాడు.శివానీకి ఇది ఏ మాత్రం ఇష్టం లేదు. దీంతో ఆమె ఆరీఫ్ ప్రేమను నిరాకరించింది. తన ప్రేమను కాదన్నందుకు కోపంలో శివానీని ఆరీఫ్ హత్య చేశాడు. శివానీ మూడు రోజుల కిందట జూన్ 26 న హత్యకు గురైనప్పటికీ ఈ ఘటన ఆదివారం వెలుగులోకి వచ్చింది. శివానీ పనిచేస్తోన్న బ్యూటీ పార్లర్ నుండి వాసన రావడంతో పోలీసులు మృతదేహాన్ని గుర్తించారు. నిందితుడి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.
![]() |
![]() |
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa