గుండెకు నిరంతరాయంగా రక్తం సరఫరా అవుతూ ఉండాలి. సరఫరా ఏ మాత్రం నిలిచినా.. శరీరంలోని మొత్తం వ్యవస్థ స్తంభించిపోతుంది. గుండె పోటుకు ముందు శరీరం కొన్ని సంకేతాలను ఇస్తుంది.
-> గుండె నొప్పికి ముందు శ్వాస తీసుకోవడం కష్టంగా అనిపిస్తుంది. ఈ లక్షణం కనిపిస్తే తప్పకుండా అప్రమత్తం కావాలి.
-> మాట్లాడేటప్పుడు గందరగోళానికి గురికావడం, ఒకే విషయాన్ని ఎక్కువసార్లు చెప్పడం వంటి సూచనలను కూడా గుండెపోటుకు లక్షణాలుగా భావించాలి.
-> రక్త సరఫరా తగ్గినట్లయితే గుండెల్లో మంటగా ఉంటుంది. అప్పుడు వెంటనే వైద్యుడిని సంప్రదించాలి.
-> గుండె భారంగా, అసౌకర్యంగా అనిపిస్తే వైద్యుడిని సంప్రదించాలి.
-> శరీరం పైభాగం నుంచి ఎడమ చేతి కింది వరకు నొప్పిగా అనిపిస్తే తప్పకుండా గుండె నొప్పి రాబోతుందని గుర్తించాలి.
![]() |
![]() |
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa