మోదీతో భేటీ అవడానికి బయలుదేరిన రామ్‌నాథ్ కోవిద్

  Written by : Suryaa Desk Updated: Mon, Jun 19, 2017, 06:34 PM
 

ఎన్డీఏ రాష్ట్ర‌ప‌తి అభ్య‌ర్థిగా త‌న పేరును ప్ర‌క‌టించిన అనంత‌రం బీహార్ గ‌వ‌ర్న‌ర్‌ రామ్‌నాథ్ కోవిద్... పాట్నా నుంచి ఢిల్లీకి బ‌య‌లుదేరారు. పాట్నాలోని రాజ్‌భ‌వ‌న్ వ‌ద్ద‌కు ఈ రోజు బీజేపీ కార్య‌క‌ర్త‌లు భారీగా త‌ర‌లివ‌చ్చారు. వారికి అభివాదం చేస్తూ రామ్‌నాథ్ బ‌య‌లుదేరారు. ఢిల్లీలో ఆయ‌న ప్ర‌ధాన‌మంత్రి మోదీతో భేటీ కానున్నారు. ఈ నెల 23న రామ్‌నాథ్ కోవిద్ నామినేష‌న్ వేయాల్సి ఉంది. మ‌రోవైపు ప్ర‌తిప‌క్ష పార్టీలు త‌మ అభ్య‌ర్థి పేరును ఇప్ప‌టివ‌ర‌కు ప్ర‌క‌టించ‌లేదు. విపక్షాలు త‌మ‌ రాష్ట్రపతి అభ్యర్థిగా మీరాకుమార్ పేరును ప్ర‌క‌టించే అవ‌కాశం ఉంద‌ని స‌మాచారం.