ఫుడ్ డెలివరీ సంస్థ జొమాటో ఉద్యోగులు తమదైన శైలిలో చైనాకి వ్యతిరేకంగా నిరసన తెలిపారు. కోల్‌కతాలో కొంత మంది ఉద్యోగులు తాము వేసుకున్న కంపెనీ టీషర్టులను చింపి మంటల్లో తగలబెట్టారు. జొమాటో సంస్థలో చైనాకి చెందిన ఓ కంపెనీ పెట్టుబడి పెట్టింది. దాన్ని ఉద్యోగులు వ్యతిరేకిస్తున్నారు. ఈమధ్య జూన్ 15న గాల్వాన్ లోయలో చైనా సైన్యంతో జరిగిన ఘర్షణలో భారత సైనికులు 20 మంది అమరులవ్వడంతో వారికి మద్దతుగా ఈ ఉద్యోగులు ఈ నిర్ణయం తీసుకున్నారు. బెహాలాలో సంస్థకు వ్యతిరేకంగా నినాదాలు చేసిన ఉద్యోగులు తాము జొమాటోలో ఉద్యోగం మానేస్తామనీ ప్రజలు కూడా జొమాటో నుంచి ఫుడ్ డెలివరీ చేయించుకోవద్దని కోరారు.
![]() |
![]() |
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa